ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ సన్‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్‌‌‌‌‌‌‌‌ ఇక 10 లీటర్ల జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో

ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ సన్‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్‌‌‌‌‌‌‌‌  ఇక 10 లీటర్ల జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో

లాంచ్ చేసిన యాంకర్ సుమ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌తో వంటనూనె  అమ్ముతున్న  జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్‌‌‌‌‌‌‌‌  బుధవారం  10 లీటర్ల  ఫ్రీడమ్ సన్‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్ జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చింది. తెలుగు యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమ కనకాల  చేతుల మీదుగా దీనిని లాంచ్ చేశారు. ఈ జార్‌‌‌‌‌‌‌‌ ధర సుమారు రూ. 1,000 ఉంటుందని కంపెనీ వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌) పీ చంద్ర శేఖర రెడ్డి అన్నారు. 

 ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ రిఫైన్డ్ సన్‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్ 200 ఎంఎల్‌‌‌‌‌‌‌‌, అర లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లీటర్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్లలో, అర లీటర్, లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2 లీటర్ల  బాటిళ్లలో అందుబాటులో ఉంది. 5 లీటర్ల జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 15 లీటర్ల  టిన్‌‌‌‌‌‌‌‌, 15 లీటర్ల జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో మార్కెట్‌‌‌‌‌‌‌‌లో దొరుకుతోంది. 

తాజాగా 10 లీటర్ల జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఆయిల్‌‌‌‌‌‌‌‌ను వాడేశాక ఈ జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇతర అవసరాలకు అంటే పప్పులు, రైస్ వంటివి దాచుకోవడానికి వాడుకోవచ్చని  చంద్ర శేఖర రెడ్డి వెల్లడించారు. ఆంధ్రా, తెలంగాణలోని ప్రతీ ఐదు కుటుంబాలలో మూడు ఫ్రీడమ్ సన్‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్‌‌‌‌‌‌‌‌ను వాడుతున్నాయని చెప్పారు.

 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి 50 వేల టన్నుల సన్‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్ అవసరమవుతోందని అన్నారు. తెలంగాణలో 36 శాతం మార్కెట్ వాటాతో, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో 67.5 శాతం వాటాతో  మార్కెట్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫ్రీడమ్‌‌‌‌ కొనసాగుతోందని వివరించారు.