
- మృగశిర 3,4 పాదములు; ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం కా, కీ, కూ, ఖం, జ్ఞ, చ్చ, కే, కో, హ
- ఆదాయం : 14
- రాజపూజ్యం : 4
- వ్యయం : 2
- అవమానం : 3
గురువు: 30.03.2025 నుండి 08.05.2025 వరకు తామ్రమూర్తిగాను ఉగాది వరకు లోహమూర్తిగా సంచారము. శని: ఉగాది నుండి మరల ఉగాది వరకు దశమంలో తామ్రమూర్తిగా సంచారము.
రాహుకేతువులు: ఉగాది నుండి మరల ఉగాది వరకు ప్రతి విషయంలో అనేక సమస్యలతో ఇబ్బందులు, ధన నష్టంతో సంచారము. ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా అనుకూలంగా ఉంటుంది. రైతు సోదరులకు అధిక ఆదాయ వనరులు కలిగి ఉండగలరు. వృత్తి వ్యాపారస్తులకు సంతృప్తికరంగా, అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలో కొంతవరకు శ్రద్ధ పెట్టగలరు. నిర్లక్ష్యంగా ఉన్నారా ధనమును అనేక రకములుగా దుర్వినియోగం జరుగుతుంది. మీ మాటలో లౌక్యం అవసరమున్నది. మీరు ముక్కుసూటిగా మాట్లాడుట వలన నష్టం కలిగించగలరు. లాయర్లు, డాక్టర్లు మనసును అదుపులో పెట్టుకొని అధిక ఆదాయం.
►ALSO READ | వృషభ రాశి వారి జాతకం ఈ ఏడాది ఎలా ఉంది..? ఆదాయం, వ్యయం ఎంతంటే..?
కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. వెండి బంగారం వ్యాపారులు నిర్లక్ష్య భావన లేకుండా మెలగవలెను. బిగ్ ఇండస్ట్రీ వారికి అనుకూలం. స్మాల్ ఇండస్ట్రీ వారికి ఆదాయ వనరులు సంతృప్తినివ్వగలవు. టింబర్, ఐరన్, సిమెంట్ కంకర వ్యాపారులకు కలిసివచ్చే రోజులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది. రాజకీయ నాయకలు మితముగా మాట్లాడుట వనల అందరు అనుకూలంగా ఉంటారు. మీరు ఏ పరిస్థితులలో అదుపు తప్పరాదు. ఫ్యాన్సీ, కిరాణ, వస్త్ర వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. చిట్స్, షేర్స్ వారికి కష్టములు ఉన్నవి. చాపలు, పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ వారికి సామాన్య లాభములు.
సినిమా వారికి కొంత వరకు అనుకూలము. టీవీ, రేడియో అనేక విధములు ఆటుపోట్లు కలిగి ఉన్నారు. మీరు చేయు వ్యాపారములలో కొన్ని సందర్భములలో మనశ్శాంతి లేకుండా చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. జాయింట్ వ్యాపారస్తులకు ఆకస్మిక కలహములు ఉన్నవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాయ వనరులు ఉన్నవి. మానసిక సమస్యలు ఉన్నవి. తక్కువగా మాట్లాడి ఎక్కువుగా పని చేసుకొనగలరు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడగలరు. చాలా సందర్భంలలో కీలకమైన విషయములు ఇతరుల ద్వారా పూర్తిచేసుకొనగలర.
పిల్లల చదువులలో అనుకూలత. ఉద్యోగస్తులకు స్థానచలనములు. ఏసీబీ దాడులు లంచం అడిగినవారు దొరికిపోగలరు. కలహములు మానసిక ఒత్తిడి తెలియని సమస్యలు వెంటాడగలవు. అనారోగ్య సూచనలు కలిగి ఉన్నారు. ఏ పరిస్థితులలో ఒత్తిడికి గురికారాదు. ప్రతినిత్యం మృత్యుంజయ జపము 108 సార్లు చేయండి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఆదాయం బాగున్న ఒత్తిడి వలన ఉద్రేకము వలన అనారోగ్యం కనిపిస్తుంది. మీరు పట్టుదలతో కొన్ని సమస్యలను సవరణ చేసుకొని ముందుకు వెళ్లగలరు. మీరు రాజకీయమునకు పనికిరారు.
అలా అని సమర్ధులు కారని కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉన్నారు. యోగ, ధ్యానం, ఆక్యుప్రెషర్తో దినచర్యలో మార్పులు చేసుకొని సుఖమైన జీవన విధానములో అడుగుపెట్టండి. మృగశిర నక్షత్రం వారు జాతి పగడం ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు, గోవుకు మంగళవారం 450 గ్రా. కందులు నానపెట్టి దానగా పెట్టండి. ఆరుద్ర నక్షత్రం వారు జాతి గోమేధికం ధరించి ప్రతినెలలో ఆరోగ్యం కొరకు ఆరుద్ర నక్షత్రంలో శివునకు మహన్యాస రుద్రాభిషేకం చేయించండి. దుర్గాదేవికి కుంకమపూజ అష్టోత్తరము చేయుట వలన ఆర్థికంగా లోటు లేకుండా గడచిపోగలదు.
►ALSO READ | శ్రీ విశ్వావసు నామ సంవత్సర గంటల పంచాంగం.. జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించి గురువు దక్షిణామూర్తికి పారాయణం, షిరిడిసాయి బాబాకి పూజలు ప్రతి గురువారం శనగలు గుగ్గిళ్లు కొబ్బరి ముక్కలు కలిపి ఎంతమందికి ఈ ప్రసాదం మీ చేతితో పెట్టగలిగితే అంత అనుకూలంగా ఉంటుంది. గృహంలో అఖండ దీపారాధన ఉంచండి. నిరంతరం గురువు దక్షిణామూర్తి పారాయణ చేయుట వలన మాటలలో పొదుపు వస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతముగా ఖర్చులు తగ్గి మాటలు చెప్పి డబ్బు సంపాదించగలరు. ఈ మార్గము రాజమార్గం. అదృష్టసంఖ్య 5.