పాల్వంచ, వెలుగు : పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మూడు రోజులు నిర్వహించిన టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్టు వాలీబాల్, లాన్ టెన్నిస్ పోటీల ఛాంపియన్ గా భూపాలపల్లి లోని కేటీపీపీ జట్టు నిలిచింది. రన్నర్స్ గా కేటీపీఎస్ 5,6 దశ జట్టు, మూడో స్థానంలో కేటీపీఎస్ ఏడో దశ జట్లు నిలిచాయి. నాలుగో స్థానంలో మణుగూరు బీటీపీఎస్ జట్టు నిలిచింది.
లాన్ టెన్నిస్ క్రీడలో టీమ్ ఈవెంట్ విభాగంలో ఛాంపియన్ గా కేటీపీ ఎస్ 7వ దశ జట్టు నిలిలువగా రెండో స్థానంలో కేటీపీఎస్ 5,6 దశ, మూడో స్థానంలో భూపాలపల్లి కేటీ పీపీ జట్టు, 4 స్థానంలో మణుగూరు బీటీపీఎస్ జట్లు నిలిచాయి. ఈ మేరకు క్రీడాకారులకు కేటీపీఎస్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్లు పీవీ రావు, ఎం.ప్రభాకర్ రావు, శ్రీనివాస బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహితానంద్, కేటీపీఎస్, బీటీపీఎస్ స్పోర్ట్స్ సెక్రటరీలు వై.వెంకటేశ్వర్లు, టీ. వీరస్వామి, కల్తీ నరసింహారావు పలువురు అధికారులు పాల్గొన్నారు.