ఇవాస్ బ్రాండ్​ అంబాసిడర్​గా జెనీలియా

ఇవాస్ బ్రాండ్​ అంబాసిడర్​గా జెనీలియా

హీరో ఎక్స్‌‌ట్రీమ్  200ఎస్ వచ్చేసింది..

హీరో మోటోకార్ప్​ ఎక్స్​ట్రీమ్​ 200 ఎస్​ 4 వాల్వ్ బైక్​ను లాంచ్​ చేసింది. హీరో మోటోకార్ప్ డీలర్‌‌షిప్‌‌లలో ఇది లభిస్తుంది. ధర రూ. 1,41,250 (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధర). ఇందులో 200 సీసీ 4 వాల్వ్​ఇంజన్​ ఉంటుంది. ఇది ఓబీడీ2, ఈ20 కంప్లైంట్ ఇంజన్‌‌ కాబట్టి 
6 శాతం ఎక్కువ శక్తిని,  5 శాతం అదనపు టార్క్‌‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

టాస్క్​తో రత్నదీప్ ఒప్పందం 

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ & నాలెడ్జ్ (టాస్క్)  రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ)తో రిటైల్ చైన్ రత్నదీప్ చేతులు కలిపింది.   "రత్నదీప్ రిటైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌"ను స్థాపించేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. దీనిద్వారా  యువ ఎంట్రపెనార్లకు స్కిల్స్​ నేర్పిస్తారు. ఉపాధి కల్పిస్తారు. రిటైల్ రంగం అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తారు. హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి,    టాస్క్ సిఇఒ శ్రీకాంత్ సిన్హా,  పరిశ్రమలు, ఐటీశాఖల ప్రిన్సిపల్​సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

పోర్షే నుంచి కొత్త కార్లు

పోర్షే ఇండియా   ఇండియా మార్కెట్లో కొత్త కయెన్,  కయెన్ కూపే కార్లను   లాంచ్​ చేసింది. కొత్త కయెన్ కార్లు ఎన్నో ఫీచర్లతో వచ్చాయని పోర్షే తెలిపింది. ఇంజన్​ మరింత శక్తిని ఇస్తుందని, డ్రైవింగ్​ను ఎంతో ఎంజాయ్​ చేయవచ్చని ప్రకటించింది. ఈ కార్ల డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.  కయెన్ ధర రూ. 1,35,61,000 కాగా, కయెన్ కూపే ధర రూ.1,41,85,000

ఇవాస్ బ్రాండ్​ అంబాసిడర్​గా జెనీలియా  

 ఇవాస్ అంబాసిడర్​గా నటి జెనీలియా దేశ్‌‌ముఖ్​ను నియమించామని ఇన్​ఫ్రా మార్కెట్​ ప్రకటించింది.  జెనీలియా ప్రచారంతో తమ బ్రాండ్‌‌ మరింత మందికి చేరువ అవుతుందని తెలిపింది. ఇది టైల్స్, శానిటరీవేర్, బాత్ ఫిట్టింగ్‌‌లు, ఎలక్ట్రికల్స్, మాడ్యులర్ కిచెన్, ఫర్నీచర్  డిజైనర్ హార్డ్‌‌వేర్లను అమ్ముతుంది.