హాట్‌‌‌‌హాట్‌‌‌‌గా కరీంనగర్ బల్దియా మీటింగ్​

  •     ఎజెండాలోని 22 అంశాలకు కౌన్సిల్​ ఆమోదం

కరీంనగర్ టౌన్, వెలుగు:  కరీంనగర్ బల్దియాలో సోమవారం నిర్వహించిన జనరల్​బాడీ మీటింగ్​గరంగరంగా  జరిగింది. ప్రతిపక్ష, అధికారపక్ష సభ్యులు ప్రశ్నలతో అధికారులను  నిలదీశారు.  భూకబ్జాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు  ఎదుర్కొంటున్న కార్పొరేటర్లను బర్తరఫ్​ చేయాలని, అక్రమాలకు పాల్పడుతున్న టౌన్​ ప్లానింగ్​ అధికారులపై చర్యలు తీసుకోవాలని 55వ డివిజన్ కార్పొరేటర్  జితేందర్​ పోడియం వద్ద దీక్షకు దిగారు.

తెలంగాణ  తల్లి విగ్రహాన్ని  ఏర్పాటు  చేయాలని, సిటీలో చేపడుతున్న పనులకు సంబంధించిన రికార్డులను  ఫిజికల్‌‌‌‌గా ఎంక్వైరీ  చేయకుండా ఆన్‌‌‌‌లైన్​చేయించిన ఎస్ఈపై చర్యలు తీసుకోవాలని మాజీ  మేయర్ సర్దార్​రవీందర్‌‌‌‌‌‌‌‌సింగ్​ డిమాండ్​చేశారు. టవర్​సర్కిల్‌‌‌‌లో డ్రైనేజీ వ్యవస్థ, లైటింగ్, కోతుల సమస్యలపై కార్పొరేటర్లు నిలదీశారు. మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ.36లక్షలతో కుక్కలకు బర్త్  కంట్రోల్ ఆపరేషన్లు,రూ.20 లక్షలతో  2400  కోతులను  అడవి ప్రాంతానికి  తరలించామన్నారు.

1వ టౌన్ జంక్షన్ లో తెలంగాణ తల్లి, చొక్కారావు విగ్రహాలను ఏర్పాటు  చేస్తామన్నారు.  అధికారులు  సక్రమంగా పనిచేసి,  నగర ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మేయర్​సూచించారు. అనంతరం  22 ఎజెండా  అంశాలను కౌన్సిల్​ఆమోదించింది.  సమావేశంలో  డిప్యూటీ మేయర్ స్వరూపరాణిహరిశంకర్, డిప్యూటీ కమిషనర్  స్వరూపరాణి,  కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు  పాల్గొన్నారు.