ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద 2024 ఫిబ్రవరి 17 శనివారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో లోకోపైలట్ రైలును నిలిపివేశాడు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి.
ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపమే కారణంగానే ఈ ప్రమాదం జరిందని రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.