ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే ఎంపికయ్యారు. మనోజ్ పాండేను ఇండియన్ ఆర్మీ 29వ చీఫ్ గా నియమిస్తూ భారత రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా శనివారం ప్రస్తుత జనరల్ ఎమ్ఎమ్ నరవాణే నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో  కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి ఆర్మీ చీఫ్ గా ఎంపికైన మొదటి వ్యక్తిగా జనరల్ మనోజ్ పాండే రికార్డ్ సృష్టించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. 1982 డిసెంబర్ 24న మనోజ్ పాండే ఇండియన్ ఆర్మీలోని కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగంలో చేరారు. 39 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆర్మీలోని వివిధ హోదాల్లో పని చేశారు.

మరిన్ని వార్తల కోసం...

స్కూల్స్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి

రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి

హీరోయిన్ జాక్వెలిన్‌ ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ