హైదరాబాద్, వెలుగు: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం సోమవారం నుంచి ‘జనరల్‌స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో కంటెంట్‌ను ప్రసారం చేయనున్నట్టు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అన్ని పోటీ పరీక్షలకు పనికొచ్చేలా జనరల్ స్టడీస్క్లాసులను నిర్వహిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.10 సబ్జెక్టులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంటెంట్‌ను 500 రోజుల పాటు 600 ఎపిసోడ్లుగా ప్రసారం చేస్తున్నామని చెప్పారు.
నిపుణ చానెల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు.. విద్య చానెల్లో అదే రోజు రాత్రి 8 నుంచి 10 వరకు పున:ప్రసారం చేస్తున్నామని వివరించారు. తెలంగాణ ఉద్యమం, ఇండియన్ హిస్టరీ, మ్యాథ్స్, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులతో పాటు సోషల్ఎక్స్క్లూజన్, జనరల్ ఇంగ్లిష్సబ్జెక్టులకూ కూడా కంటెంట్‌ను ప్రసారం చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.