ఐటీ సర్వే : 2024 నాటికి జనరేటివ్ AI హవా తగ్గిపోతుందా..?

ఐటీ సర్వే : 2024 నాటికి జనరేటివ్ AI హవా తగ్గిపోతుందా..?

2022లో ప్రారంభం అయినప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI ) టెక్నాలజీ హవా కొనసాగుతోంది. ప్రతి వారం ఏదో ఒక కొత్త ఫీచర్, ప్రాడక్ట్ లతో విడుదల చేస్తుందంటే దాని ప్రభావం ఎంతుంతో తెలుస్తోంది. AI టెక్నాలజీ ఆకర్షణీయమైన కంటెంట్ ను రూపొందించడంలో విశేష ప్రతిభ కనబరుస్తోంది. AI రూపొందించిన కంటెంట్ వినోదం, విద్య, మార్కెటింగ్  వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. OpenAI ChatGPT, Google Bard , Anthropic's Claude వంటి ఉత్పాదక AI రియల్ మోడల్స్, ఆకర్షణీయమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆకట్టుకునే సామర్థ్యాలను చూపించాయి. అయితే 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI ) టెక్నాలజీ హవా తగ్గిపోతుందని ఐటీ సర్వేలు చెబుతున్నాయి. 

AI- రూపొందించిన కంటెంట్ ఇంటర్నెట్‌లో మంచి క్రేజ్ ఉంది.  అయితే ఇది దాని ప్రామాణికత, నాణ్యత విషయంలో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. AI రూపొందించిన కంటెంట్ వినోదం, విద్య, మార్కెటింగ్ వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ కొన్ని AI- లు రూపొందించిన కంటెంట్ కస్టమర్లను తప్పుదారి పట్టించే విధంగా, హాని కలిగించే విధంగా ఉండొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రానున్న రోజుల్లో రియాలిటీ చెక్ ను ఎదుర్కొంటుందని టెక్ సర్వేలు చెపుతున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ సీసీఎస్ ఇన్ సైట్ సర్వే ప్రకారం.. 2024నాటికి  ఈ టెక్నాలజీ నిర్వహణ ఖర్చు, ట్రైనింగ్, ఏఐ ఆధారంగా జరిగే మోసాలతో పాటు ఇతర నష్టాలపై కంపెనీలు ఓ అంచనాకు వస్తాయని.. అపుడు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రియాల్టీ చెక్ ఎదుర్కొంటుందని తెలుస్తోంది. అంతేకాదు మొదటి AI- ఆధారంగా జరగిన మోసాలకు సంబంధించి వచ్చే ఏడాది అరెస్టు చేయబడుతుందని నివేదిక అంచనా వేసింది. 

Generative AI models అయిన OpenAIకి చెందిన ChatGPT, Google కు చెందిన Bard, Anthropic చెందిన Claude వంటి ఉత్పాదక AI రియాల్టీ మోడల్స్, ఆకర్షణీయమైన కంటెంట్‌ను రూపొందించడంలో వాటికి పనితనాన్ని ఇప్పటికే చూపించాయి. అయినప్పటికీ శిక్షణ , ఏఐ నిర్వహణ, అమలు చేసేందుకు భారీ మొత్తంలో కంప్యూటింగ్ శక్తి,డేటా అవసరం. ఇవి 2024లో ఎక్కువయ్యే అవకాశాలున్నాయని పెరిగే ఖర్చులు, టెక్నాలజీ అమలతో ఏర్పడే ఇబ్బందులతో  జనరేటివ్ AI  వచ్చే ఏడాది రియాలిటీ చెక్‌ను ఎదుర్కొంటుందని CCS ఇన్‌సైట్ అంచనా వేస్తోంది. 
జనరేటివ్ AI టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ ప్రచారం జరిగిందని దానిని మార్కెట్లో నిలబెట్టుకోవాలంటే చాలా అడ్డంకులు అధిగమించాల్సిన అవసరం ఉందని CCS ఇన్‌సైట్ ఎనలిస్ట్ బెన్ వుడ్ చెప్పారు.