పపువా న్యూ గినియాలో నరమేధం

పపువా న్యూ గినియాలో నరమేధం
  • 26 మందిని నరికేసిన దుండగులు
     

పపువా న్యూ గినియాలో నరమేధం జరిగింది.  జులై 16 నుంచి 18 మధ్య జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మూడు గ్రామాలపై ఓ దుండుగల ముఠా దాడి చేసి 26 మందిని నరికి చంపింది. సంఘటనా స్థలంలో చిన్నారులు, మహిళలు, పురుషుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వీటిలో కొన్ని మృతదేహాలను మొసళ్లు సమీప సరస్సులోకి లాక్కెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. దుండగులు ఇళ్లను దహనం చేయడంతో గ్రామస్తులంతా పోలీసు స్టేషన్‌లో తలదాచుకుంటున్నారు. భూములు, సరస్సుల యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ దారుణం జరిగింది.