- కొత్త భవన శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వానం
ముషీరాబాద్, వెలుగు:అరుదైన వ్యాధులను కూడా సాధారణ ప్రజలు గుర్తించి.. వాటిని నివారించేలా జీనోమ్ ఫౌండేషన్ పనిచేస్తుందని సంస్థ ఎండీ డాక్టర్ కేపీసీ గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లిలో ఫౌండేషన్‌కు 4.13 ఎకరాల భూమి ని కేటాయించారని తెలిపారు.
హైదరాబాద్‌లోని వినూత్న ఆరోగ్య సంరక్షణ కేంద్రం జెనోమిక్ వెల్నెస్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఏర్పాటుతో పాటు అత్యధిక సౌకర్యాలు మౌలిక సదుపాయలతో మేడిపల్లిలో నిర్మించనున్నామని తెలిపారు. అక్టోబర్ 9న ఈ బిల్డింగ్ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని, దీనికి ఆయన అంగీకరించారని తెలిపారు. అలాగే, తమ సంస్థకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.
రోగులకు వారి కుటుంబాలకు ఉచిత జన్యు సలహాలు సేవలు ప్రత్యామ్నాయ చికిత్స రోగ నిర్ధారణ సేవలను ఎలాంటి లాభాలు లేకుండా అందిస్తుందని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో డాక్టర్లు సోమరాజు, ప్రసాదరావు, ప్రొఫెసర్ రెడ్డన్న, కోసరాజు ఆర్ రావు, డాక్టర్ కార్తీక్ ఉన్నారు.