లోయర్ సర్క్యూట్ను తాకిన జెన్సోల్ షేర్లు.. కంపెనీ డైరెక్టర్​ రాజీనామా

లోయర్ సర్క్యూట్ను తాకిన జెన్సోల్ షేర్లు.. కంపెనీ డైరెక్టర్​ రాజీనామా

న్యూఢిల్లీ: జెన్సోల్​ ఇంజనీరింగ్​ ప్రమోటర్లు - అన్మోల్ సింగ్ జగ్గీ , పునీత్ సింగ్ జగ్గీలను సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించడంతో కంపెనీ షేర్లు గురువారం 5 శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్ పరిమితిని తాకాయి. - నిధుల మళ్లింపు,  పాలనాపరమైన లోపాల కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని  సెబీ స్పష్టం చేసింది. అంతేగాక కంపెనీ ఇండిపెండెంట్​డైరెక్టర్ అరుణ్​ మీనన్​ గురువారం రాజీనామా చేశారు. 

స్టాక్ 4.97 శాతం పడిపోయి రూ.117.50కి చేరింది ఎన్​ఎస్​ఈ లో  ఇది 5 శాతం క్షీణించి రూ.116.54కి చేరుకుంది .- ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. బుధవారం కూడా జెన్సోల్ ఇంజనీరింగ్ షేర్లు 5 శాతం తగ్గి లోయర్ సర్క్యూట్ పరిమితిని తాకాయి. 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,125.75 నుంచి  ఈ స్టాక్ ఇప్పుడు 89.56 శాతం తగ్గింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్మోల్  పునీత్ సింగ్ జగ్గీలు జెన్సోల్‌‌‌‌లో డైరెక్టర్ లేదా కీలక పదవుల్లో ఉండకుండా సెబీ నిషేధం విధించింది. 

జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (జీఈఎల్​) ప్రకటించిన స్టాక్ విభజనను నిలిపివేయాలని ఆదేశించింది. కంపెనీ నిధులను అన్మోల్ సింగ్ జగ్గి,  పునీత్ సింగ్ జగ్గి సొంతానికి వాడుకున్నారని సెబీ స్పష్టం చేసింది.