Geomagnetic storm to hit Earth: రిస్కులో శాటిలైట్స్, పవర్ గ్రిడ్స్, స్పేస్ స్టేషన్లు..ఎందుకంటే

Geomagnetic storm to hit Earth: రిస్కులో శాటిలైట్స్, పవర్ గ్రిడ్స్, స్పేస్ స్టేషన్లు..ఎందుకంటే

సౌర తుఫాన్లతో భూమికి రిస్క్ తప్పదా.. సౌర తుఫాన్లు భూమిని తాకితే ఏం జరుగుతుంది. సౌర తుఫాన్ల వల్ల ప్రభావితం అయ్యేవి అంశాలేంటీ.. సూర్యుడి నుంచి ఆగస్టు 7, 8 తేదీల్లో వెలువడిన 3 తీవ్రస్థాయి సౌర తుఫాన్లు.. 2 రోజుల్లో భూమిని తాకనున్నాయి.  ఈక్రమంలో సౌరతుఫాన్ పై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. 

సౌర తుఫాన్లు సెకనుకు వెయ్యి కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నాయని సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ చెబుతోంది. ఉపగ్రహాలు, కమ్యూనికేషన్స్, పవర్ గ్రిడ్స్‌పై వీటి ప్రభావం ఉండొచ్చని చెబుతోంది. వీటిలో మూడో తుఫాను కేటగిరీ-3 స్థాయిదని అంటున్నారు. సాంకేతిక మౌలిక వసతుల విషయంలో ముందుగా సన్నద్ధం కావాలని చెబుతోంది. 

మూడు కరోనల్ మాస్ ఎజెక్షన్లు (CME) ప్రస్తుతం భూమివైపు దూసుకొస్తున్నాయి. మొదటి రెండు M క్లాస్ సోలార్ ఫ్లేర్స్ ద్వారా ఆగస్టు 7న ప్రారంభమయ్యాయి. మొదటి రెండు చాలా చిన్నవి. కానీ మూడోది  X1.3 క్లాస్ సోలార్ ద్వారా ఉత్పన్నమయింది. ఇది ఆగస్టు 8న ప్రారంభమైంది. ఇది అత్యధిక వేడితో చాలా శక్తివంతమైంది. 

CME అనేది సూర్యిని కరోనా పై పెరుగుతున్న సౌరగాలి, అయస్కాంత క్షేత్రాల భారీ విస్పోటనం వల్ల ఏర్పడుతుంది. ఈ విస్ఫోటనాలు బిలియన్ల టన్నుల ప్లాస్మాను అంతరిక్షంలోకి విడుదల చేస్తాయి. ఇది భూమి మాగ్నెటోస్పియర్ పై  ప్రభావం చూపుతుంది. మాగ్నెటోస్పియర్ లేయర్ లో ఉన్న కమ్యూనికేషన్,  శాటిలైట్లు , పవర్ గ్రిడ్స్ లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు.