ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఏ స్థానంలో ఆడతాడనే విషయం కొన్ని నెలలుగా సస్పెన్స్ గా మారింది. డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆసీస్ కు ఓపెనింగ్ సమస్యలు ఏర్పాడ్డాయి. వార్నర్ స్థానాన్ని ఖచ్చితంగా ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఓపెనర్ గా ప్రమోట్ అయినప్పటికీ అంతగా రాణించడం లేదు. 8 ఇన్నింగ్స్ లో కేవలం 171 పరుగులే చేసి విఫలమయ్యాడు. యావరేజ్ కేవలం 28 మాత్రమే. ఈ దశలో స్మిత్ ఓపెనర్ గా కొనసాగుతాడా అనే విషయంపై పెద్ద చర్చ జరిగింది.
స్మిత్ విఫలమైనా బ్యాటింగ్ లో కొందరు అంటుంటే.. తనకు కలిసొచ్చిన నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని మరికొందరు సలహాలిచ్చారు. అయితే తాజాగా స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఆర్డర్ పై సస్పెన్స్ వీడింది. స్మిత్ ఓపెనర్ గా రాడని.. అతను మిడిల్ ఆర్డర్ లోనే బరిలోకి దిగుతాడని ఆస్ట్రేలియా సెలక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ కన్ఫర్మ్ చేశాడు. దీంతో స్మిత్ భారత్ తో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నెంబర్ 4 లోనే బరిలోకి దిగనున్నాడు.
ALSO READ | CC Trophy: హెడ్, జయసూర్యపై ఆధిపత్యం.. శ్రీలంక క్రికెటర్‌కు ఐసీసీ అవార్డు
స్మిత్ నెంబర్ 4 లో రానుండడంతో ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ ఓపెనర్ ను వెతుక్కోవాల్సి వచ్చింది.ఆల్ రౌండర్ గ్రీన్ ను ఓపెనర్ గా పంపుదామనే ఆలోచనలో ఉన్నా..అతనికి ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా ఖవాజాతో ఓపెనింగ్ కోసం ఎవరిని వెతుకుతుందో చూడాలి. కొత్తగా ఎవరినైనా సెలక్ట్ చేస్తుందో లేకపోతే ట్రావిస్ హెడ్ లేదా మిచెల్ మార్ష్ ను ఓపెనర్ గా ప్రయోగిస్తుందో సిరీస్ ప్రారంభయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.
సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.
Steve Smith will return to his preferred No.4 slot against India 🤝
— ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2024
🔗 https://t.co/zNgkJIiduk | #AUSvIND pic.twitter.com/PSCtUyabWO