EURO 2024: యూరో క‌ప్‌లో సంచ‌ల‌నం.. పోర్చుగ‌ల్‌పై ప‌సికూన‌ జట్టు విజయం

EURO 2024: యూరో క‌ప్‌లో సంచ‌ల‌నం.. పోర్చుగ‌ల్‌పై ప‌సికూన‌ జట్టు విజయం

పోర్చుగ‌ల్‌ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అభిమానులు జీర్ణించుకోలేని కథనమిది. ఈ వరల్డ్ ఫేమ‌స్ ఫుట్ బాలర్ జట్టు ఓ పసికూన టీమ్ చేతిలో ఓటమి పాలైంది. గురువారం(జూన్ 27) అర్థరాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో జార్జియా 2-0 తేడాతో పోర్చుగ‌ల్‌ను మట్టి కరిపించింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో కనీసం ఒక్క గోల్ కూడా కొట్టకపోవడం గమనార్హం. 

బాణసంచా వెలుగులు

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేశాక ఆఫ్ఘన్ ప్రజలు ఎలా అయితే సంబరాలు చేసుకున్నారో.. పోర్చుగ‌ల్‌పై విజయం తరువాత జార్జియాలో అలానే సంబరాలు కనిపించాయి. గెలుపు తరువాత రాజధాని టిబిలిసి(Tbilisi)లో బాణసంచా కాలుస్తూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంతో జార్జియా మొట్టమొదటి మేజర్ టోర్నమెంట్‌లో నాకౌట్‌కు అర్హత సాధించింది.

మరోవైపు, ఓడినప్పటికీ, పోర్చుగల్ రెండు విజయాలు, ఒక ఓటమితో గ్రూప్ ఎఫ్‌లో అగ్రస్థానంలో ఉంది. వారు తదుపరి మ్యాచ్ రౌండ్ ఆఫ్ 16లో జూలై 1న స్లోవేనియాతో తలపడనున్నారు.