మోదీ పరివార్లో చేరిన ఇటలీ ప్రధాని?.. స్క్రీన్ షాట్ వైరల్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారత ప్రధాని మోదీ కోసం తన ట్విట్టర్ యూజన్ నేమ్ ను మార్చుకున్నారా.. ఇది నిజమేనా..మెలోని  X(గతంలో ట్విట్టర్) ఫ్రొఫైల్ లో మోదీకా పరివార్ అని రాసుకున్నట్లు చూపే ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ వైరల్ ఇమేజ్.. జార్జియా మెలోనీ తన ప్రొఫైల్ (మోదీ కా పరివార్ ) అని రాసుకున్నట్లు చూపిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది.. నిజంగానే ఇటలీ ప్రధాని మెలోని తన ట్విట్టర్ ఫ్రొఫైల్ అలా రాసుకుందా.. వైరల్ అవుతున్న ఆ ఇమేజ్ కథేంటో తెలుసుకుందాం.. 

మెలోని పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ఫ్రొఫైల్ కు సంబంధించి ఆ ఇమేజ్ లో కనిపిస్తున్నప్పటికీ.. ఇది నిజమే అని కొంతమంది నమ్మారు. అయితే మరికొంది నెటిజన్లు మాత్రం ఇది నిజమేనా.. ఒక దేశానికి ప్రధాని.. మన దేశప్రధానికి ఇంతలా ఫ్యాన్ అయిపోయిందా.. నిజంగానే తన ప్రొఫైల్ ను మార్చుకుందా అని డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.  ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తన ప్రొఫైల్  పేరును మార్చలేదు.. ఇది కేవలం తప్పుడు సమాచారం అని వాదిస్తున్నారు నెటిజన్లు. 

ఇందులో నిజమెంత? 

అయితే ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన ప్రొఫైల్ లో తన పేరుతో పాటు మోదీకా పరివార్ అని రాసుకున్నట్లు ఉన్న ఇమేజ్ లో వాస్తవం లేదు.. అది నకిలీ అని రుజువైంది. జార్జియా మెలోని తన ప్రొఫల్ పేరును మార్చలేదు. ఇది కేవలం తప్పుుడు ప్రచారం మాత్రమే.  మెలోని X ప్రొఫైల్ ఇమేజ్ ని ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. అయితే ఇది ఆమె అసలు ఫ్రొఫైల్ కి చాలా అచ్చుగుద్దినట్లు ఉంది. ఇది వాస్తవ కంటెంట్ అని నమ్మేలా ఉంది. ఈ ఇమేజ్ ఆమె బయోని మార్చకుండా ఇతర వివరాలను చూపిస్తుంది. ఇద్దరు ప్రధానులు ఉన్న ఇమేజ్ తో మోదీ కుటుంబంలో సభ్యురాలు అని మాత్రమే మార్చుతూ.. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంచి మోడిఫై చేశారు. 

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంబంధించిన ఫొటోలు వీడియోలు మార్ఫింగ్ గురి కావడం ఇదేం మొదటి సారి కాదు.. 2024 ప్రారంభంలో ఆమె లక్ష ద్వీప్, మాల్దీవులను సందర్శించినట్లు కొన్ని ఇమేజ్ లు వైరల్ అయ్యాయి. ఆమె మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకొని లక్ష ద్దీప్ ను సందర్శించినట్లు ఫేక్ ట్వీట్లు వైరల్ అయ్యాయి. 

సాధారణంగా మోదీ, జార్జియా మెలోనీ ని కలిపి చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు.. ఎందుకంటే వారి మధ్య స్నేహంఅలాంటింది. ఇది మెలోని హ్యాష్ ట్యాగ్ కు దారితీసింది కూడా.