క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఒకప్పుడు అరుదుగా చూసేవాళ్ళం. కానీ టీ 20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేశారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు. తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి మహిళా ప్రీమియర్ లీగ్ లో నమోదయింది.
మహిళా ప్రీమియర్ లీగ్ లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 1) చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. హాయ్ స్కోరింగ్ థ్రిల్లర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో బెంగళూరు జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయినా బౌండరీ దగ్గర ఆ జట్టు ప్లేయర్ వేర్‌హామ్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో ఆ జట్టుకు నాలుగు పరుగులు సేవ్ చేసింది. ఇనింగ్స్ 11వ ఓవర్లో షఫాలీ వర్మ కొట్టిన షాట్ ను మిడ్‌వికెట్ లో వేర్‌హామ్ తన సమయస్ఫూర్తిని చూపించింది. వేగంగా వెళ్తున్న బంతిని గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకొని బయటకు విసిరేసింది.
ALSO READ :- NZ v AUS: ఆసీస్ ఆటగాడు భారీ సెంచరీ.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
మహిళల మ్యాచ్ లో ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు చాలా అరుదుగా జరుగుతాయి. వేర్‌హామ్ చేసిన ఈ ఫీల్డింగ్ విన్యాసం మాజీ ఆర్సీబీ ప్లేయర్ డివిలియర్స్ ను గుర్తు చేసింది. 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో AB డివిలియర్స్ సరిగా ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసంతో మెప్పించాడు. దీంతో చాలా మంది RCB అభిమానులకు ఒక్కసారిగా డివిలియర్స్ ను గుర్తుకు చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు 169 పరుగులకే పరిమితమైంది.
WHAT A SAVE BY GEORGIA WAREHAM...!!!! 🔥
— Sekhar (@Sekharsiddhu) February 29, 2024
This reminds of ABD save for RCB#RCBvDC
pic.twitter.com/yDzeXIyG5Y