IPL 2024: మయాంక్ యాదవ్ రికార్డ్ బ్రేక్: దక్షిణాఫ్రికా పేసర్ ఫాస్టెస్ట్ డెలివరీ

క్రికెట్ లో రికార్డ్స్ బ్రేక్ అవ్వడం కామన్. ఐపీఎల్ విషయానికి వస్తే ఆ రికార్డ్స్ కాస్త తొందరగా బద్ధలవుతాయి. అయితే ఒక రికార్డ్ మాత్రం రెండు రోజుల్లోనే బ్రేక్ అయింది. భారత యువ క్రికెటర్ మయాంక్ యాదవ్ మొన్నటివరకు జరిగిన ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ ల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఏకంగా గంటకు 155.8 వేగంతో బంతిని సంధించాడు. తాజాగా ఈ రికార్డ్ దక్షిణాఫ్రికా పేస్ బౌలర్..గెరాల్డ్ కోయెట్జీ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ బ్రేక్ చేశాడు. 

ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 1) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గెరాల్డ్ కోయెట్జీ 15 ఓవర్ లో మూడో బంతిని గంటకు 157.4 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. 23 ఏళ్ల ఈ సఫారీ బౌలర్.. మెరుపు వేగంతో విసిరిన ఈ బంతిని రాజస్థాన్ బ్యాటర్ రియాన్ పరాగ్ హుక్ షాట్ ఆడగా.. కీపర్ తల మీద నుంచి ఫోర్ వెళ్ళింది. దీంతో ఈ ఐపీఎల్ లో వేగవంతమైన బంతిగా  కోయెట్జీ మయాంక్ యాదవ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. 

ALSO READ :- IPL 2024: ఇక్కడ కూడా ధోనీదే హవా: హైదరాబాద్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్

రాజస్థాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోయింది. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్ 6  వికెట్ల తేడాతో  ముంబైని చిత్తు టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తొలుత ముంబై 20 ఓవర్లలో 125/9 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లతో 34), తిలక్ వర్మ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 సిక్సర్లతో 32) మాత్రమే రాణించారు.  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో రాయల్స్‌‌‌‌‌‌‌‌ 15.3 ఓవర్లోనే 127/4 స్కోరు చేసి గెలిచింది. బౌల్ట్‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.