worlds first transparent car: వరల్డ్ ఫస్ట్ ట్రాన్స్ఫరెంట్ కారు వచ్చేసింది. దీని బాడీ మొత్తం అద్దాలతో తయారు చేయబడింది.అంతేకాదు ఈ కారులో సెక్యూరిటీ ఫీచర్స్ మాత్రం చాలా పటిష్టంగా ఉన్నాయి. జర్మన్ ఆటోమేకర్ కంపెనీ ZF అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ సిస్టమ్ తో ఈ కారును రూపొందించింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ లో జరిగిన ఆటో షో IAA రెండో ప్రెస్ డే లో ఈ కారును ఆవిష్కరించారు. ఈ కొత్త కారు లేటెస్ట్ సెక్యూరిటీ టెక్నాలజీతో ప్రమాదాదలను తగ్గించేందుకు , ప్రాణాలను రక్షించేందుకు రూపొందించామని కంపెనీ చెబుతోంది.
ఈ కారులో సెక్యూరిటీ సిస్టమ్ అత్యంత స్ట్రాంగ్ రూపొందించారు. అకస్మాత్తుగా ఎదురుపడే అడ్డంకులను గుర్తించేందుకు స్వతహాగా పనిచేసే ఎయిర్ బ్యాగ్స్, యాక్టివ్ బ్రేకింగ్, స్టీరింగ్ సిస్టమ్ ఉంది.కారు చుట్టూ ఉన్న సెన్సార్లు 360 డిగ్రీల కోణంలో ఫీల్డ్ నుంచి సమాచారాన్ని అందించగలదు. కారు ప్రయాణిస్తున్న మార్గాన్ని స్కాన్ చేసి పాదచారులు లేదా ఇంకేమైన వాహనాలు ఇతరత్రా దారిలో ఉంటే వెంటనే గుర్తించి అలర్ట్ చేస్తుంది.
ALSO READ :- IPL 2024: స్లో ఓవర్ రేట్ పెనాల్టీ అంటే ఏమిటి? లక్షల్లో జరిమానా ఎందుకు..?
ఈ కొత్త కారులో యాక్టివ్ సీట్ బెల్ట్ లు కూడా అమర్చబడి ఉన్నాయి. ఇవి ప్రమాద సమయంలో సరైన రీతిలో బిగించుకొని.. ముందుకు పడిపోయే ప్రయాణికులను తప్పించి ఎక్కవు గాయాలు కాకుండా కాపాడగలవు.