కోస్టల్ ఏరియాలో జర్మనీ కంపెనీ రూ.12 వేల కోట్ల పెట్టుబడి​

కోస్టల్ ఏరియాలో జర్మనీ కంపెనీ రూ.12 వేల కోట్ల పెట్టుబడి​

న్యూఢిల్లీ: కెమికల్ ​సెక్టార్​కు చెందిన జర్మనీ కంపెనీ మనదేశంలో 1.5 బిలియన్​ డాలర్లు (దాదాపు రూ.12 వేల కోట్లు) ఇన్వెస్ట్​ చేయడానికి అంగీకరించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్​ గోయల్​వెల్లడించారు. ప్లాంటు నిర్మాణం కోసం ఒక రాష్ట్రం భూమి కూడా ఇచ్చిందని చెప్పారు. అయితే కంపెనీ పేరును గానీ, రాష్ట్రం పేరును గానీ ఆయన వెల్లడించలేదు. 

దాదాపు 12 నెలల్లోపు పనులు మొదలవుతాయని మాత్రమే పేర్కొన్నారు. పోర్టు దగ్గర 250 ఎకరాల భూమి తీసుకుందని చెప్పారు. మనదేశంలో భారీగా ఇన్వెస్ట్​చేసే దేశాల్లో జర్మనీ తొమ్మిదో స్థానంలో ఉంది. ఆ దేశం నుంచి 2000–2024 మధ్య 15 బిలియన్​ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. మనదేశంలో వ్యాపారం చేయడానికి మరిన్ని కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని గోయల్​ అన్నారు. ఈజ్​ ఆఫ్ డూయింగ్​బిజినెస్​ విధానాలను మెరుగుపరుస్తున్నామని ఆయన వివరించారు.