ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.30 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత

 ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.30 కోట్ల విలువైన  కొకైన్ పట్టివేత

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్  పట్టుబడింది. 30కోట్ల విలువైన  ఆరు కిలోల కొకైన్ పట్టుకున్నారు అధికారులు. ఇంటర్ పోల్ ఇచ్చిన  పక్కా సమచారంతో తనిఖీలు చేశారు అధికారులు. భారత సంతతికి చెందిన  జర్మన్ వ్యక్తి కుమార్  నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని అతన్ని..అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు.  నిందితుడు దోహా నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో వచ్చాడు.  కొకైన్ ను రెండు బొమ్మల లోపల ట్యాబ్లెట్ల రూపంలో దాచి తెచ్చాడు. మొత్తం 270 క్యాప్సూల్స్  ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.  ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జూలై 23న ఇందిరాగాంధీర ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో టాంజానియా నుండి వచ్చిన ఒక టాంజానియా ప్రయాణికుడి  నుంచి  రూ.11.13 కోట్ల విలువైన 742 గ్రాముల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణణ కొనసాగిస్తున్నారు.