
ఒక్కో దేశంలో ఒక్కో వస్తువు ఒక్కో ఆకృతిలో ఉంటాయి. సాధరణంగా టాయిలెట్లు.. వెస్ట్రన్... ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి. ఇండియన్ టాయిలెట్ అంటే పూర్తిగా కూర్చోవాలి. కాని కొంతమంది ఆరోగ్య రీతా మోకాళ్ల నొప్పులున్న వారు సగం వరకే కూర్చోగలుగుతారు. అటువంటి వారు వెస్ట్రన్ టాయిలెట్స్ వాడతారు. అయితే దాదాపు ప్రతి ఇంట్లో రెండు రకాల టాయిలెట్స్ ఉంటాయి.
అయితే జర్మనీలో మాత్రం టాయిలెట్స్ భిన్నమైన ఆకృతిలో ఉంటాయి. వీటికి బేసిన్ భాగం చదునుగా ఉండి .....రంధ్రం వ్యతిరేక దిశలో ఉంటుంది. ఈ విధంగా ఉండటానికి ప్రత్యేక కారణం ఉందని జర్మన్ డిజైనర్లు అంటున్నారు. జర్మన్ టాయిలెట్ దిగువభాగం ఎందుకు ప్లాట్ గా ఉంటుంది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
జర్మనీ, హంగరీ , నెదర్లాండ్స్‌లోని టాయిలెట్లు యూరప్, ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియాలోని టాయిలెట్ల కంటే చాలా భిన్నంగా ఉంటాయని సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండేలారెంట్ రిచర్డ్ అన్నారు. వాటి దిగువ భాగం చదునుగా ఉండి రంధ్రం కూడా వ్యతిరేక దిశలో తయారు చేయబడింది. ఈ విధంగా ఉండటం మురికి రంధ్రం లోపలికి వెళ్లి కనిపించకుండా ఉంటుంది. దీంతో వాసన వచ్చే అవకాశాలు కూడా తక్కువుగా ఉంటుంది.
రంధ్రం నేరుగా కిందకు ఉంటే మురికి లోపలికి వెళ్ళిన తర్వాత.... లోపల ఉన్న నీరు బయటకు పోయి శరీరం వెనుక భాగాన్ని తాకుతుంది. ఇది టాయిలెట్ వినియోగదారులకు కొంత అసౌకర్యంగా ఉంటుంది. దీంతో జర్మనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతను ఈ సమస్యను పరిష్కరించే అటువంటి డిజైన్‌ను కనుగొన్నాడు.
‘noplacelikeanywhere’ అనే వెబ్‌సైట్ ప్రకారం, జర్మన్ దేశంలో టాయిలెట్‌లో మురికి నేరుగా రంధ్రంలోకి వెళ్లకుండా షెల్ఫ్ ఉంటుంది. రంధ్రం వ్యతిరేక దిశలో ఉన్నందున బాటమ్ డిజైన్, ప్లష్ అయిన తరువాత మురికిని బయటకు రానివ్వకుండా ఉంటుంది. మురికి బయటకు రాకుండా..కనపడకుండా ఉండేందుకు జర్మన్ ప్రజలు ఉపయోగించే టాయిలెట్ భిన్నాకృతిలో ఉంటుంది.