వారంలో తక్కువ రోజుల పనిదినాలు ఉంటే ఉత్పాదకత పెరుగుతుందని జర్మనీ ప్రభుత్వం నమ్ముతోంది. చాలాకాలంగా ఉద్యోగుల కొరత ఎదుర్కొంటున్న జర్మని కంపెనీలు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుందని ఆశిస్తున్నాయి.
జర్మనీ కంపెనీలు తన ఉద్యోగులతో ఆరు నెలల పాటు వారానికి నాలుగు రోజులే పనిదినాలు అని ట్రయల్ ను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 45 కంపెనీల్లో ట్రయల్ రన్ గా వారానికి నాలుగు రోజులు పనిదినాలను అమలు చేస్తుంది. దీని ప్రకారం.. వారానికి ఐదు రోజుల జీతంతో కేవలం నాలుగు రోజులు పనిదినాలు మాత్రమే ఉద్యోగులతో పనిచేయించాలని నిర్ణయించింది.
లాభాపేక్ష కోరుకోని సంస్థ 4 డే వీక్ గ్లోబల్ సహకారంతో బెర్లిన్ కు చెందిన మేనేజ్ మెంట్ కన్సల్టేన్సీ ఇంట్రాప్రెనార్ నేతృత్వంలోని కంపెనీలు మాత్రమే వారానికి నాలుగు రోజుల పనివిధానంలో భాగస్వాములవుతున్నాయి.
ఉత్పాదకత అనేది సాధారణంగా ఆర్థిక ఉత్పత్తిని పనిచేసిన గంటలతో డివైడ్ చేయడం ద్వారా లెక్కిస్తారు. నవంబర్ 2017లో ఆల్ టైం రికార్డ్ స్థాయిలో 105.20 పాయింట్లకు చేరిన తర్వాత జర్మనీ ఉత్పాదకత క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. అయితే జర్మన్ బండెస్ బ్యాంక్ డేటా ప్రకారం యూరప్ లోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఇది ఎక్కువగా ఉంది. తాజా డేటా ప్రకారం.. 2023 నవంబర్ లో ఉత్పాదకత అంతకుముందు నెలలో 96.79 నుంచి 65.80 పాయింట్లకు పడిపోయింది.
ప్రస్తుత పరిస్థితుల్లో జర్మనీ లేబర్ షార్టేజ్, తక్కువ ఉత్పాదకత సమస్యను ఎదుర్కొంటోంది. వారానికి నాలుగు రోజులు పనివిధానం ద్వారా ఉద్యోగుల సంతోషం, ఎక్కువ ఉత్పాదకత సాధించి ఈ గండం నుంచి బయట పడేలా చేస్తుందని నమ్ముతోంది.