జర్మనీలో మళ్లీ లాక్ డౌన్

జనవరి 10 వరకు స్కూల్స్.. షాపులు పూర్తిగా బంద్

కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో జర్మనీలో మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. ఈనెల 16 నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కరోనాను కంట్రోల్ చేయలేని పరిస్థితి.. మరోవైపు క్రిస్మస్.. జనవరి 1 వేడుకలతో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని గ్రహించి కఠిన లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 10 వరకు కఠినంగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు జర్మనీ ప్రకటించింది. స్కూల్స్.. షాపులను కంప్లీట్ గా బంద్ చేయాలని.. ఒకే చోట కనీసం 5 మందికి మించి గుమిగూడకూడదని లాక్ డౌన్ రూల్స్ లో నిర్దేశించింది. ఒకే గదిలో కూడా ఐదు మంది ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై కూడా నిషేధం విధించారు. కొత్త సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుండి.. జనవరి 1 న బాణసంచా అమ్మకాలను కూడా నిషేధించింది.