గల్ఫ్ లో వెల్లడించని ఆస్తులు ఉన్న వేలాది మంది భారతీయులు... డేటా ఇచ్చిన జర్మనీ

గల్ఫ్ లో వెల్లడించని ఆస్తులు ఉన్న వేలాది మంది భారతీయులు... డేటా ఇచ్చిన జర్మనీ

గల్ఫ్ ప్రాంతంలోని వేలాది మంది భారతీయులు వెల్లడించని ఆస్తులు కలిగి ఉన్నారని జర్మనీ తెలిపింది. ఈ మేరకు అత్యంత సెన్సిటివ్ డేటా భారత ప్రభుత్వానికి షేర్ చేసింది జర్మనీ. ఇరు దేశాల మధ్య డ్యూయల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ లో ఉన్న 'స్పాంటేనియస్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్' నిబంధన కింద ఈ డేటాను వెల్లడించినట్లు తెలిపింది జర్మనీ.ఈ డేటాలో దుబాయ్ సహా యూఏఈ లోని ఇతర నగరాల్లో వెల్లడించని ఆస్తులు కలిగి ఉన్న 1,000 మంది భారతీయుల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ డేటా ఆధారంగా ఆదాయ పన్ను శాఖ అక్టోబర్ చివరి నుండి ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా 14 నగరాల్లో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2011లో ఫ్రాన్స్ లీక్ చేసిన హెచ్ఎస్ బీసీ స్విస్ అకౌంట్ల డేటా కంటే ఈ డేటా మించిపోయిందని తెలుస్తోంది.మొత్తానికి స్విస్ బ్యాంకు అకౌంట్ల రూపంలో మనోళ్లు ఈ రకంగా సంపద పోగేస్తున్నారా అంటూ.. ఈ డేటా లీక్ పై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.