ఇంటి కాంపౌండ్ వాల్ మీద దీపాలు పెడుతుంటారు ఈ పండుగకి. ఈసారి ఈ ఆర్జీబీ లైట్లను పెట్టి చూడండి. లుక్ చాలా బాగుంటుంది. గెస్టో అనే కంపెనీ వీటిని మార్కెట్ చేస్తోంది. ఇంటీరియర్ లేదా ఎక్స్‌టీరియర్ స్పేస్‌లో ఎక్కడైనా పెట్టొచ్చు. ఈ మల్టీకలర్ లైట్లు ఇతర లైట్లతో పోలిస్తే.. 90 శాతం వరకు పవర్‌ని ఆదా చేస్తాయి. వీటి మీద వర్షం కురిసినా పాడు కావు.
ఈ లైట్ల మీద మందపాటి రౌండ్ పీవీసీ ట్యూబ్ ఉంటుంది. దానివల్ల ఐపీ65 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. వీటిని వార్డ్‌రోబ్, బెడ్రూమ్లో కూడా వాడొచ్చు. ఇంటీరియర్ డెకరేషన్ చేసేటప్పుడు సీలింగ్‌కి లేదా ఫాల్స్ సీలింగ్‌కి కూడా పెట్టుకోవచ్చు.
ధర : 5 మీటర్లకు 399 రూపాయలు