T20 World Cup 2024: చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. పాక్ ముందు స్వల్ప టార్గెట్

T20 World Cup 2024: చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. పాక్ ముందు స్వల్ప టార్గెట్

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు నిరాశ పరిచారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై పాక్ బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోర్ కే పరిమితమయ్యారు. తొలి 10 ఓవర్లలో పటిష్ట స్థితిలో ఉన్న భారత్.. ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలింది. దీంతో 19 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంత్ 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

పంత్ ఒంటరి పోరాటం

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు రెండో ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. నాలుగు పరుగులు చేసి కోహ్లీని నసీం షా పెవిలియన్ కు పంపాడు. తర్వాత కాసేపటికే  13 పరుగులు చేసిన రోహిత్ ఔటవ్వడంతో భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పంత్ అక్షర్ పటేల్ జట్టును ఆదుకున్నారు. బ్యాటింగ్ కు కష్టంగా బౌండరీలు రాబట్టారు. వీరిద్దరి మధ్య 39 పరుగుల భాగస్వామ్యం తర్వాత 20 పరుగులు చేసి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. 

7 పరుగులకే నాలుగు వికెట్లు

మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. 7 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సూర్య (7), దూబే (3),పంత్ (42) , జడేజా (0) వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో 89/3 తో నిలిచిన భారత్ 96/7 తొలి నిలిచింది. ఆ తర్వాత ఆదుకుంటాడనుకున్న హార్దిక్ (7) కూడా ఔట్ కావడంతో భారత్ 119 పరుగులకే పరిమితమైంది. హారిస్ రౌఫ్, నసీం షా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. మహమ్మద్ అమీర్ 2, షహీన్ ఆఫ్రిది ఒక వికెట్ పడగొట్టారు.