
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు సిటీ ముస్తాబవుతోంది. జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా సంబురాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి అవుతుండగా.. ప్రధాన వేడుకలు నిర్వహించే పరేడ్ గ్రౌండ్ తో పాటు ట్యాంక్ బండ్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.
పలు విభాగాల పోలీసు బలగాలు ప్రదర్శించే కవాతుకు శుక్రవారం రిహార్సల్ చేస్తుండగా.. ట్యాంక్ బండ్ పై గ్రిల్స్ కు రంగులు వేయడం.. విద్యుత్ దీపాల అలంకరణ కొనసాగుతుంది.