Raju Yadav OTT: OTTకి వచ్చేస్తున్న రాజు యాదవ్.. గెటప్ శ్రీను నటన అద్భుతం

Raju Yadav OTT: OTTకి వచ్చేస్తున్న రాజు యాదవ్.. గెటప్ శ్రీను నటన అద్భుతం

బుల్లితెర కమల్ హాసన్ గా పేరుతెచ్చుకున్నారు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను. కామెడీ స్కిట్స్ కోసం చిత్ర విచిత్రమైన గెటప్స్ వేస్తూ అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే వరుస సినిమా అవకాశాలు కూడా దక్కించుకున్నాడు. ఓపక్క సినిమాల్లో కమెడియన్ గా చేస్తూనే.. రాజు యాదవ్ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేశారు గెటప్ శ్రీను. కొత్త దర్శకుడు కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాలో అంకిత ఖరత్ హీరోనే గా నటించారు. 

ఈ సినిమా మే 24న థియేటర్స్ లో విడుదల అయ్యింది. అయితే.. సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా తన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు గెటప్ శ్రీను. సినిమాలో కొన్ని కారణాల వల్ల ఎప్పుడు నువ్వుతూ ఉండేలా మారిపోతుంది రాజు యాదవ్ మొహం. అలా సినిమా మొత్తం కనిపించి మెప్పించాడు శ్రీను. ఎమోషనల్ సీన్స్ లో కూడా అదే లెవల్లో నటించి శబాష్ అనిపించాడు. అందుకే.. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శ్రీను నటనకు ప్రశంసలు దక్కాయి. 

తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జూన్ 22 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.