Raju Yadav Official OTT: ఓటీటీలోకి గెటప్ శ్రీను మూవీ..రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Raju Yadav Official OTT: ఓటీటీలోకి గెటప్ శ్రీను మూవీ..రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బుల్లితెర కమల్ హాసన్ గా పేరుతెచ్చుకున్నారు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను. కామెడీ స్కిట్స్ కోసం చిత్ర విచిత్రమైన గెటప్స్ వేస్తూ అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే వరుస సినిమా అవకాశాలు కూడా దక్కించుకున్నాడు. ఓపక్క సినిమాల్లో కమెడియన్ గా చేస్తూనే.. రాజు యాదవ్ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేశారు గెటప్ శ్రీను. కొత్త దర్శకుడు కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమా మే 24న థియేటర్స్ లో విడుదల అయ్యింది. 

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఖరారైంది. బుధవారం జూలై 24వ తేదీన ఆహాలో రాజుయాదవ్ స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే..ఈ సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా తన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు గెటప్ శ్రీను. కొన్ని కారణాల వల్ల ఎప్పుడు నువ్వుతూ ఉండేలా మారిపోతుంది రాజు యాదవ్ మొహం. అలా సినిమా మొత్తం కనిపించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా అదే లెవల్లో నటించి శబాష్ అనిపించాడు. అందుకే..సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శ్రీను నటనకు ప్రశంసలు దక్కాయి.

రాజు యాదవ్ మూవీని రాజేశ్ కళ్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించగా.. సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా సపోర్ట్ చేశారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.