ఇంట్లో రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ని వాడుతుంటారు. వాటిలో ఒక్కోదాన్ని ఆపరేట్ చేసేందుకు ఒక్కో రిమోట్ ఉంటుంది. అలాకాకుండా ఇంట్లో ఉన్న అన్ని గాడ్జెట్స్‌ని ఆపరేట్ చేసేందుకు ఒక రిమోట్ ఉంటే బాగుంటుంది కదా! అలాంటిదే ఈ అడాప్టర్. దీంతో అన్ని గాడ్జెట్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. ఈ అడాప్టర్‌ని గెట్జ్‌గెట్ అనే కంపెనీ తయారుచేసింది. చాలా చిన్నగా ఉంటుంది.
ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టేందుకు వాడే పోర్ట్‌తో దీన్ని కనెక్ట్ చేయాలి. ఐవోస్ లైటెనింగ్, మైక్రో యూఎస్‌బీ వేరియెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ట్రెడిషనల్ ఇన్‌ఫ్రారెడ్ రిమోట్(ఐఆర్)తో చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. యాప్ సాయంతో ఫోన్‌తోనే అన్ని రకాల డివైజ్‌లు కనెక్ట్ చేసుకోవచ్చు. పది మీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో టీవీ, డీవీడీ ప్లేయర్, ఏసీ, ప్రొజెక్టర్, లైట్, ఫ్యాన్ లాంటి ఐఆర్ డివైజ్‌లను కంట్రోల్ చేయొచ్చు.
ధర : 950 రూపాయలు