కొండమల్లేపల్లి(చింతపల్లి) వెలుగు : తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి వేస్తుందని దేవరకొండ శాసనసభ్యుడు నేనావత్ బాలూనాయక్ అన్నారు. చింతపల్లి మండల పరిధిలోని గోడుకొండ్ల వెంకటేశ్వరనగర్(మాల్)లో శనివారం అలివేలుమంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై వేంకటేశ్వరస్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఎంపీపీ కొండూరు భవానీపవన్ కుమార్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, కాంగ్రెస్మండల అధ్యక్షుడు నాగభూషం, ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, నాయకులు సంజీవ రెడ్డి, జాల నరసింహా రెడ్డి, సిరాజ్ ఖాన్, వైస్ ఎంపీపీ యాదిగౌడ్, వడ్త్య దేవేందర్, తిరందాసు కృష్ణయ్య, జాను యాదవ్, గుండ్లపల్లి నరసింహరెడ్డి, కుక్కల గోవర్ధన్ రెడ్డి, లోకసాని శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, కిన్నెర హరికృష్ణ, జటావత్ హరి, శేఖర్ గౌడ్, శ్రీశైలం, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.