జింకను కాపాడిన GHMC సిబ్బంది

జింకను కాపాడిన GHMC సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: చెరువులో పడి మునిగి పోతున్న జింకను సకాలంలో చూసి జీహెచ్​ఎంసీ లేక్ ప్రొటెక్షన్ సిబ్బంది కాపాడారు. నల్లగండ్ల చెరువు రక్షణ కోసం సిబ్బంది పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన జింక శుక్రవారం ఉదయం చెరువులో పడి  మునిగిపోతుండడాన్ని గమనించారు. దీంతో   లేక్  ప్రొటెక్షన్ సిబ్బంది చెరువులోకి దిగి తాళ్ల సహాయంతో బయటకు తీసి కాపాడారు. అనంతరం  జింకను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈసందర్భంగా లేక్ ప్రొటెక్షన్ సిబ్బందిని  జీహెచ్​ఎంసీ విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టర్  విశ్వజిత్ కంపాటి అభినందించారు.