అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్‌‌‌‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‎లర్‎గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్​మెంట్‎లో సీనియర్ ప్రొఫెసర్‎గా ఉన్న ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారు. మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక రాష్ట్ర పబ్లిక్​సర్వీస్​కమిషన్‎కు తొలి చైర్మన్‎గా ఘంటా చక్రపాణి పనిచేశారు. 

జేఎన్టీయూ ఇన్​చార్జ్ వీసీగా బాలకిష్టారెడ్డి

జేఎన్టీయూ ఇన్ చార్జ్ వీసీగా బాలకిష్టారెడ్డిని నియమిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్​గా కొనసాగుతున్నారు. కాగా, ఇప్పటి వరకూ వర్సిటీ ఇన్​చార్జ్ వీసీగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం.. టీజీపీఎస్సీ చైర్మన్ గా వెళ్లగా ఆ పదవీ ఖాళీ అయింది. దీంతో తాత్కాలికంగా బాలకిష్టారెడ్డిని సర్కారు నియమించింది.