పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లికి చెందిన నార్లపురం అనూష త్వరలో జరగనున్న ఇండో నేపాల్ అండర్ 19 కబడ్డీ పోటీలకు ఇండియా కెప్టెన్‌గా ఎంపికైంది. పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో విషయం తెలుసుకున్న మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ గంట రవీందర్ రూ. 10 వేలు అందజేశారు.
ఆయన వెంట హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పోతుగంటి నర్సయ్య, కొడకండ్ల రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ దిలీప్, బాబయ్య పాల్గొన్నారు.