నిఖిల్ దేవాదుల, ఆర్వికా గుప్తా జంటగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఎం.సి.రాజు ఈ చిత్రానికి కథను అందిస్తూ నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం అక్టోబర్ 14న టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ ‘ఇదొక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్. ఒక టీనేజ్ అబ్బాయి చుట్టూ తిరిగే కథ. ట్విస్ట్‌లు, టర్న్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది హీరోయిన్ ఆర్వికా.
19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్‌లో జరిగిన కథ ఇదని డైరెక్టర్ అమర్ చెప్పాడు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి చిన్న సినిమాలే కీలకం అని నిర్మాత ఎస్‌కేఎన్ అన్నారు. డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని, రైటర్స్ డార్లింగ్ స్వామి, శ్రీనివాస్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.