ఘట్కేసర్, వెలుగు : ఓ హత్య కేసు నుంచి నిందితుడిని తప్పించిన ఘట్కేసర్సీఐ సైదులును రాచకొండ సీపీ సుధీర్‌బాబు సస్పెండ్‌చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 15న ఘట్కేసర్మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్హత్యకు గురయ్యాడు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐ సైదులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. అయితే, ప్రధాన నిందితుడిని కేసు నుంచి తప్పించారని మృతుడి బంధువులు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడిని కేసు నుంచి తప్పించినట్లు తేలడంతో సీపీ సస్పెండ్ చేశారు.