- ఘట్కేసర్ ఆర్ఐపై కలెక్టర్‌కు బాధితుడి ఫిర్యాదు
ఘట్కేసర్, వెలుగు: ఇంటి ప్లాట్‌లో బోరు వేసుకోవడానికి రెవెన్యూ అధికారికి లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఓ బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీలోని కొర్రెముల లక్ష్మీనగర్‌కు చెందిన సోలిపురం చంద్రశేఖర్ రెడ్డి తన ప్లాట్‌లో ఆదివారం బోరును తవ్విస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఆర్ఐ సాయిరామ్ సంఘటనా స్థలానికి వెళ్లి పర్మిషన్ లేదని అడ్డుకున్నాడు.
కాసేపటికి ఆయన వెళ్లిపోయిన తర్వాత తన వద్ద పనిచేసే ప్రైవేటు వ్యక్తి మల్లేశ్‌ను అక్కడి పంపించాడు. రూ.50 వేలు ఇవ్వాలని, లేదంటే బోరు వేయడానికి వీల్లేదని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో రూ.35 వేల నగదును ఇచ్చినట్లు బాధితుడు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపాడు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేయగా, సదరు ఆర్ఐపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారన్నారు. అయితే, పర్మిషన్ వచ్చేవరకు బోరు వేయొద్దని సూచించానే తప్ప ఎటువంటి లంచం డిమాండ్ చేయలేదని ఆర్ఐ సాయిరామ్ తెలిపాడు. లంచం తీసుకున్న వ్యక్తి కూడా ఎవరో తనకు తెలియదన్నారు.