హ్యాట్సాఫ్ గురూ : సోలార్ పవర్ కారు తయారు చేసిన గల్లీ కుర్రోడు

హ్యాట్సాఫ్ గురూ : సోలార్ పవర్ కారు తయారు చేసిన గల్లీ కుర్రోడు

నిజంగా ఈ గల్లీ కుర్రోడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న  సమయంలో ఇలాంటి సోలార్ పవర్ వాహనాన్ని కనుగొనడం గర్వించదగ్గ విషయం. చదివింది తక్కువే అయినా.. టెక్నాలజీని వాడుకొని కొత్త ఆవిష్కరణలు చేయడం ఇతడు దిట్ట. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ కు చెందిన కుర్రాడు అజారుద్దీన్ పెట్రోల్, డీజిల్ ఆధారపడకుండా పనిచేసే సోలార్ కారును సృష్టించాడు. 

అజారుద్దీన్ తయారు చేసిన సోలార్ కారు.. ఒక్కసారి బ్యాటరీ రీచార్జ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్లు పరిగెత్తగలదు. ఈ సౌరశక్తితో నడిచే ఈ కారును తయారు చేయడానికి దాదాపు ఐదు నెలల సమయం పట్టింది. మొత్తం రూ. 4 లక్షలు ఖర్చయిందని అజారుద్దీన్ తెలిపారు. ఈ కారుకు ఫోల్డబుల్ తొలగించగల పైకప్పు, మొత్తం మోడల్ పూర్తిగా సౌర శక్తితో నడిచేలా రూపొందించబడింది. 

ఈ సోలార్ కారులో ఒకేసారి 12 మంది ప్రయాణించొచ్చు. కాలుష్య నియంత్రణలో ఈ కారు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు, వ్యవసాయ పనులకు వెళ్లేవారికి ఈ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అజారుద్దీన్ చెబుతున్నాడు. 

హైస్కూల్ చదువు పూర్తి చేసిన అజారుద్దీన్.. టెక్నాలజీని ఉపయోగించి అనేక కొత్త ఆవిష్కరణలు చేశారు. 2006లో దేశంలోనే అత్యంత తక్కువ ధరలో హెలికాప్టర్ ను తయారు చేసి అద్భుతమైన ఫీట్ సాధించాడు. ఆ తర్వాత వ్యవసాయానికి, చిన్న తరహా పరిశ్రమలకు పనికొచ్చే బ్యాటరీతో కారును అభివృద్ధి చేశాడు. 

ALSO READ : Cricket World Cup : కన్నీళ్లు పెట్టుకున్న విండీస్ ప్లేయర్.. మేం లేకుండానే అంటూ ఎమోషనల్

సోలార్ కారు అనేది సోలార్ వాహనం.. ఇది పబ్లిక్ రోడ్లు లేదా రేస్ ట్రాక్‌లలో ఉపయోగించడానికి రూపొందించబడింది. సౌర వాహనాలు సరైన పనితీరు కోసం స్వీయ-నియంత్రణ సౌర ఘటాలపై ఆధారపడి ఉంటాయి. ఈ కార్లలో పునర్వినియోగపరచదగిన బ్యాటరీని అమర్చవచ్చు.  ఇది సౌర ఘటాల ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తిని నియంత్రించడం, నిల్వ చేయడంలో సహాయపడుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి సూర్యకాంతితో పాటు అదనపు శక్తిని ఉపయోగించుకోవచ్చు.