వీడు చేసిన పనికి ఇంకా కొట్టాలి : జ్యూస్‌లో మూత్రం కలపటం ఏంట్రా వెధవా..!

వీడు చేసిన పనికి ఇంకా కొట్టాలి : జ్యూస్‌లో మూత్రం కలపటం ఏంట్రా వెధవా..!

ఓ జ్యూస్ షాప్ ఓనర్‌ని స్థానికులు చితకబాదారు. ఫుడ్ అడల్ట్‌రేషన్ లో భాగంగా అతడు చేసిన పనికి స్థానికులు కోపంతో ఊగిపోయారు. చితక బాదుడు బాది.. పోలీసులకు కూడా అప్పగించారు. అతని పేరు అమీర్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‪లో జ్యూస్ షాప్ నడుపుతుంటాడు. వచ్చిన కస్టమర్స్‌కు జ్యూస్ లో మూత్రం కలిపి ఇస్తున్నాడు.. అది గుర్తించిన ఓ వ్యక్తి ఆ విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఖుషీ జ్యూస్ కార్నర్ కు వచ్చిన కస్టమర్లకు మూత్రం కలిపిన పండ్ల రసాలను అమ్ముతున్నాడని స్థానికులు షాప్ ఓనర్ ను దారుణంగా కొట్టారు. పండ్ల రసం తయారు చేసేటప్పుడు అందులో మూత్రం కలుపుతుండడాన్ని కొందరు వ్యక్తులు గమనించారు. ఆ విషయం వెలుగులోకి రావడంతో కొద్దిసేపటికే అక్కడ పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి షాపు యజమానిని కొట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ జ్యూస్ షాప్ యజమాని అమీర్ ఖాన్‌ను మరియు అతని మైనర్ షాప్ కీపర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ALSO READ : రన్నింగ్ ట్రైన్‎లో బాలికపై వేధింపులు.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు, ప్రయాణికులు

పోలీసులు జ్యూస్‌ స్టాల్‌లో సోదాలు నిర్వహించి.. దాదాపు లీటర్ మూత్రం నింపిన ప్లాస్టిక్‌ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 13న ఘజియాబాద్ లోని ఖుషి జ్యూస్ కార్నర్ లో జరింగింది. అమీర్ ఖాన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇంతకీ ఆ షాప్ ఓనర్ అలా ఎందుకు చేశాడో తెలియదు.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జ్యూస్ లో ఎందుకు మూత్రం కలుపుతున్నాడో విచారిస్తున్నాడు.