ఆన్ లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. రోజుకో విధంగా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి.. అప్రమత్తంగా ఉండకపోతే ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డట్లే.. డిజిటల్ రంగంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇటీవల సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. సైబర్ నేరాల కట్టడిలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ మోసగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు.
ఇటీవల ఘజియాబాద్ నివాసి అయిన ప్రాచీ మాథుర్ అనే మహిళ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి ఖాతా ఖాళీ చేసుకుంది. అదనపు ఆదాయం సంపాదించాలంటే సులభమైన మార్గం.. అంటూ మేసేజ్ ల ద్వారా స్కామర్లు మాథుర్ కు మేసేజ్ లు పంపించారు. యూట్యూబ్ లో వీడియోలు చూసి లైక్ చేస్తే డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు. మొదట్లో నమ్మకాన్ని పెంచుకునేందుకు ఆమె అకౌంట్లో కి కొంత డబ్బును ట్రాన్స్ ఫర్ చేశారు.
మాథుర్ వీడియోలు లైక్ ప్రారంభించిన తర్వాత ఒక్కో లైక్ కు రూ. 50 లు చెల్లించడం ద్వారా ఆమెకు నమ్మకం కలిగించారు. సెప్టెంబర్ 18న ఆమె సంపాదన, కమిషన్ డ్రా చేసుకోవాలంటే.. వెల్ఫేర్ టాస్క్ లో డబ్బులు పెట్టుబడి పెట్టాని ఆమెకు మేసేజ్ చేశారు. ఆదాయం పెంచుకోవాలనే ఆశతో మాథుర్ మొదట రూ. 5వేలు పెట్టుబడిగా డిపాజిట్ చేసింది. ఆ తర్వాత క్రమంగా రూ. 26,800 పెట్టుబడి పెట్టారు. ఇలా మొత్తం రూ. 13 లక్షలను మోసగాళ్లకు బదిలీ చేసింది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి మేసేజ్ లేకపోవడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ: మిలాద్ -ఉన్- నబీ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఆన్ లైన్ మోసాల పట్ల పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ఆన్ లైన్ లో ఉద్యోగ అవకాశాలు, లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. LinkedIn, Naukri.com లేదా Indeed వంటి ప్రసిద్ధ జాబ్ పోర్టల్‌ల ద్వారా ఉపాధిని పొందాలని సిఫార్సు చేయబడింది. ఆన్ లైన్ లో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్న కంపెనీలు చట్టబద్దమైనవేనా కావా అని నిర్ధారించుకొని నమోదు చేసుకోవాలని తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. లాభదాయకమైన ఇన్ కమ్ ఇస్తామన్నా.. గుర్తు తెలియని బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేయడం.. బ్యాంకింగ్ కు సంబంధించిన వివరాలు షేర్ చేయడం వంటి చేయొద్దని హెచ్చరిస్తున్నారు.