జిబ్లీ ఫీచర్ ఇక అందరికీ ఫ్రీ.. గుడ్ న్యూస్ చెప్పిన ఓపెన్ ఏఐ

జిబ్లీ ఫీచర్  ఇక అందరికీ ఫ్రీ.. గుడ్ న్యూస్ చెప్పిన ఓపెన్ ఏఐ

న్యూఢిల్లీ: ఓపెన్  ఏఐ చాట్  జీపీటీకి సంబంధించిన జిబ్లీ స్టైల్  ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  ఈ ఫీచర్ ఉచితంగా దొరకుతున్నా.. చాట్  జీపీటీ స్టూడియో జిబ్లీ ఫీచర్ మాత్రం అందరికీ ఫ్రీగా లభ్యంకాలేదు. ఇకనుంచి చాట్  జీపీటీ స్టూడియో జిబ్లీ ఫీచర్ ను కూడా ఫ్రీగా ఇస్తామని ఓపెన్  ఏఐ చీఫ్​  శామ్  ఆల్ట్ మన్  తెలిపారు. 

ఫ్రీ యూజర్లకు (ఎలాంటి సబ్​స్క్రిప్షన్ తీసుకోని యూజర్లకు) కూడా ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చామని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ లో తెలిపారు. గత నెల 26న చాట్  జీపీటీ స్టూడియో జిబ్లీ ఫీచర్​ను ప్రారంభించారు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఈ ఫీచర్​ను తెగ వాడేస్తున్నారు. వారి ఫొటోలను జిబ్లీ స్టైల్​లో మార్చి యానిమేషన్  ఎఫెక్ట్స్​తో సోషల్ మీడియాలో షేర్  చేస్తున్నారు.

ఏంటీ స్టూడియో జిబ్లీ?

హయావో మియాజాకి, ఇసావో తకహత, తొషియో సుజుకి కలిసి 1985లో జపనీస్ యానిమేషన్  స్టూడియోను స్థాపించారు. దీనినే స్టూడియో జిబ్లీగా వ్యవహరిస్తున్నారు. చేతితో గీసిన యానిమేషన్, ఆహ్లాదం కలిగించే బ్యాక్ గ్రౌండ్లు, భావోద్వేగమైన కథలు చెప్పడం వంటి ఫీచర్లకు 
ఈ స్టూడియో పేరు పొందింది.