Ghibli Style: ఈ బీచ్ ఫొటోతో గిబ్లీస్టైల్కు యమక్రేజ్..5కోట్ల వ్యూస్..ఫస్ట్ టైం ఎవరు ఉపయోగించారో తెలుసా?

Ghibli Style: ఈ బీచ్ ఫొటోతో గిబ్లీస్టైల్కు యమక్రేజ్..5కోట్ల వ్యూస్..ఫస్ట్ టైం ఎవరు ఉపయోగించారో తెలుసా?

గిబ్లీ స్టైల్ ఫీచర్..ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ ఫీచర్..గిబ్లీస్టైల్ ఫొటోలు ఇంటర్నెట్ అంతటా ప్రజాదరణ పొందుతున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో సంచలనం సృష్టిస్తున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్‌లలోయూజర్లు ఇప్పుడు గిబ్లీ స్టైల్ ఫొటోలను తమ ప్రొఫైల్ ఫొటోలు వాడేస్తున్నారు. ఇది స్పెషల్ ఫీచర్కు పెరుగుతున్న క్రేజ్‌ను ప్రతిబింబిస్తుంది. అయితే ఈ ట్రెండ్‌ను ఎవరు మొదట ఎవరూ ఉపయోగించారో తెలుసా? ఇది ప్రారంభించిన కొద్దిసేపటికే ఇది ఎలా చర్చనీయాంశంగా మారింది. మొదటి గిబ్లీ స్టైల్ ఫొటో వెనుక మార్గదర్శకుడు ఎవరు?  ఈ ఫీచర్ ఇంత క్రేజ్ తెచ్చిన వ్యక్తి కథను వివరాల్లోకి వెళితే.. 

గిబ్లి శైలిని గుర్తుకు తెచ్చే యానిమేటెడ్ చిత్రాలను గతంలో కూడా ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్‌ను నిజంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సియాటిల్‌ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్రాంట్ స్లాటన్ గిబ్లీ శైలి ఫొటోలను సోషల్ మీడియాలో వెలుగులోకి తీసుకురావడానికి కారణం ఇతనే. 

►ALSO READ | Trump Vs Kim: యూఎస్ టారిఫ్స్, పుతిన్- కింమ్ జోలికి వెళ్లని ట్రంప్.. ఎందుకంటే..?

ChatGPTలో OpenAI అప్‌గ్రేడెడ్ ఇమేజ్ జనరేషన్ ఫీచర్ విడుదల చేసినప్పుడు తొలిసారి ఉపయోగించింది ఈ ఇంజనీరే.మార్చి 26న మధ్యాహ్నం స్లాటన్ ఈ గిబ్లీ ఫొటోను నెటిజన్లతో పంచుకున్నాడు. గ్రాంట్ స్లాటన్  ఓరోజు తన పెంపుడు కుక్కతో బీచ్ లో కూర్చున్నపుడు తీసుకున్న ఫొటోను గిబ్లీ స్టైల్ లోకి మార్చుకొని తన ఫ్రొఫైల్ గా పెట్టుకున్నాడు. తర్వాత ఈ ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫాం  Xలో షేర్ చేశాడు. షేర్ చేసిన క్షణాల్లోనే సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంది. కొన్ని గంటల్లోనే 45వేల లైకులు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఐదుకోట్లకు(50మిలియన్లు) పైగా వ్యూస్ సంపాదించింది. 

ఈ ఫీచర్‌ను స్వీకరించిన మొట్టమొదటి వినియోగదారు స్లాటన్ కాకపోయినా అతని పోస్ట్ నిస్సందేహంగా గిబ్లి స్టైల్ ఫొటోలను ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందేలా చేసింది. ఈ ఫీచర్ క్రేజ్ ఎంతవరకు వెళ్లిందంటే.. OpenAI యొక్క CEO సామ్ ఆల్ట్‌మాన్ తన బృందానికి కొంత రెస్ట్ కావాలి. 24 గంటలూ పని చేయలేక అలసిపోతున్నారని ప్రకటించేంతగా.. వేగాన్ని తగ్గించమని యూజర్లు హాస్యాస్పదంగా కోరిన విషయం తెలిసిందే.  అంతలా ఉంది గిబ్లీ స్టైల్ ఫీచర్ క్రేజ్.