జూన్‌‌లో 2,818 డ్రంకెన్​ డ్రైవ్ కేసులు..  400 మందికి జైలు శిక్ష.. 44 లైసెన్స్​లు సస్పెండ్ 

జూన్‌‌లో 2,818 డ్రంకెన్​ డ్రైవ్ కేసులు..  400 మందికి జైలు శిక్ష.. 44 లైసెన్స్​లు సస్పెండ్ 

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్​లో డ్రంకెన్ డ్రైవ్​పై ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సిటీ కమిషనరేట్ పరిధిలో ఒక్క జూన్ నెలలో 2,818 కేసులు నమోదు చేశారు. నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌‌ కోర్టులో 4,321 కేసుల్లో చార్జిషీట్లు ఫైల్ చేశారు. ఇందులో 400 మందికి కోర్టు జైలు శిక్ష, 3,921 మందికి రూ.93 లక్షల 19 వేలు ఫైన్ విధించింది.

44 మంది డ్రైవింగ్ లైసెన్స్​లను సస్పెండ్ చేసింది. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌‌, మైనర్ల డ్రైవింగ్‌‌, నంబర్ ప్లేట్స్, ఇతర ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై1,136 చార్జిషీట్లు ఫైల్‌‌ చేశారు.  రూ.10 లక్షల ఫైన్లు విధించారు.