రాజేంద్రనగర్లో GHMC డిమాలిష్ యాక్షన్.. ఫుట్పాత్పై అక్రమ నిర్మాణాలు కూల్చివేత

రాజేంద్రనగర్లో GHMC డిమాలిష్ యాక్షన్.. ఫుట్పాత్పై అక్రమ నిర్మాణాలు కూల్చివేత

రంగారెడ్డిజిల్లా రాజేంద్రగనగర్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ ఎంసీ కొరడా ఝుళిపించింది. ఆదివారం ( ఫిబ్రవరి 2) ఉదయం మైలార్ దేవ్ పల్లి డివిజన్ లోని ఫుట్ పాత్ లపై నిర్మించిన డబ్బాలు, అక్రమనిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. పోలీసు బందోబస్తు మధ్య సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఫుట్ పాత్ లపై వెలసి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దాదాపు 120 డబ్బాలను తొలగించారు.

 రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ, పాదచారులకు ఇబ్బంది కలుగుతుండటంతో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు జీహెచ్ ఎంసీ కమిషనర్ తెలిపారు. కూల్చేవేసిన చోట మళ్లీ అక్రమ నిర్మాణాల చేపడితే భారీ జరిమానాతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.