వానాకాలం టెన్షన్.. బల్దియా అటెన్షన్

వానాకాలం టెన్షన్.. బల్దియా అటెన్షన్

హైదరాబాద్, వెలుగు కరోనా కేసులు సిటీని టెన్షన్‌‌‌‌ పెడుతుండగా, రానున్న వానాకాలం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. చినుకులకే చెరువులను తలపించే సిటీలో సీజనల్‌‌‌‌ డిసీజెస్​ను సవాల్​గా తీసుకొని జీహెచ్‌‌‌‌ఎంసీ యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రెడీ చేసింది. ఈసారి వానలు ముందస్తుగానే పడొచ్చనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఎంటమాలజీ వింగ్​ను అలర్ట్‌‌‌‌ చేసింది. మాన్‌‌‌‌సూన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రూపొందించింది. గ్రేటర్​ అంతటా శానిటేషన్‌‌‌‌, డిసీజెస్‌‌‌‌ కట్టడికి చర్యలు తీసుకుంటూనే.. కరోనా ఎఫెక్టెడ్‌‌‌‌ ఏరియాలు, కంటెయిన్‌‌‌‌మెంట్‌‌‌‌ జోన్లపై స్పెషల్​ ఫోకస్‌‌‌‌ పెట్టనున్నట్టు బల్దియా వర్గాలు తెలిపాయి.

ఎంటమాలజీ వింగ్​కు గైడ్​లైన్స్​

ఏటా వానాకాలంలో సీజనల్‌‌‌‌ డిసీజెస్‌‌‌‌ నివారణకు జీహెచ్‌‌‌‌ఎంసీ మాన్‌‌‌‌సూన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ అమలు చేస్తుంది. ఈసారి కరోనా రావడం, కేసులు పెరుగుతుండడంతో రాబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు మరింత అప్రమత్తం అయింది. సిటీలో 750 పాజిటివ్‌‌‌‌ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందని ఎంటమాలజీ వింగ్‌‌‌‌కు బల్దియా ఉన్నతాధికారులు గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ఇచ్చారు. వైరస్​ ఎఫెక్టెడ్‌‌‌‌ ఏరియాల్లో శానిటేషన్‌‌‌‌, డిస్‌‌‌‌ఇన్‌‌‌‌ఫెక్టివ్‌‌‌‌ స్ప్రే చేస్తున్న జీహెచ్‌‌‌‌ఎంసీ టీమ్‌‌‌‌లకు వానాకాలం సవాల్​గా మారనుంది. కరోనా సోకిన వ్యక్తి ఇంటితోపాటు చుట్టుపక్కల 50 ఇండ్లను కవర్‌‌‌‌ చేస్తూ డైలీ రెండు సార్లు స్ప్రే, ఫాగింగ్‌‌‌‌ చేయనున్నాయి. దోమల వ్యాప్తిని అడ్డుకునేందుకు యాంటీ లార్వా ఆపరేషన్‌‌‌‌ అమలు చేస్తాయి. రెండు మూడు రోజుల్లో మూసీ నది, ఓపెన్‌‌‌‌ నాలాల్లో డ్రోన్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ చేపట్టనున్నట్టు ఎంటమాలజీ వర్గాలు తెలిపాయి.

స్పెషల్‌‌‌‌ మెడికల్‌‌‌‌ క్యాంపులు

గ్రేటర్​లో పెద్ద సంఖ్యలో స్పెషల్‌‌‌‌ మెడికల్‌‌‌‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని బల్దియా భావిస్తోంది. సీజనల్ డిసీజెస్‌‌‌‌ నివారణకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మెడికల్‌‌‌‌ ఆఫీసర్లతో కో ఆర్డినేట్‌‌‌‌ చేసుకునేలా ప్లాన్‌‌‌‌ చేస్తోంది. గతేడాది మాన్‌‌‌‌సూన్‌‌‌‌లో 600 మెడికల్‌‌‌‌ క్యాంపులు నిర్వహించారు. ఈసారి  800 వరకు పెట్టనున్నట్టు తెలుస్తోంది.

డోర్‌‌‌‌ టు డోర్‌‌‌‌ క్యాంపెయిన్‌‌‌‌

శానిటేషన్​పై జనాల్లో అవేర్​నెస్​ పెంచేందుకు కూడా జీహెచ్‌‌‌‌ఎంసీ చర్యలు తీసుకోనుంది. దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాలనీలు, బస్తీల్లో డోర్‌‌‌‌ టు డోర్‌‌‌‌ క్యాంపెయిన్‌‌‌‌ చేయడంతోపాటు కరోనాపైనా అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ కల్పించనుంది. అందుకోసం 6 జోన్లలో 650 ఎంటమాలజీ టీమ్‌‌‌‌లతోపాటు ఎస్​హెచ్​జీలను భాగస్వామ్యం చేయనుంది. స్థానిక రాజకీయ నేతలనూ కలుపుకొని పోనుంది. స్కూల్స్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ అయితే  వాటి పరిసరాల్లో  ప్రత్యేక చర్యలు తీసుకోనుంది.

ఇంటికి వెళ్లలేకపోతున్నానని 15వ అంతస్తు నుంచి దూకింది