బల్దియా అలర్ట్ భారీ వానల నేపథ్యంలో గ్రౌండ్ లెవల్ లో ప్రిపేర్

బల్దియా అలర్ట్ భారీ వానల నేపథ్యంలో గ్రౌండ్ లెవల్ లో ప్రిపేర్
  • అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్న కమిషనర్
  • సిద్ధంగా 534 ఎమర్జెన్సీ టీమ్ లు  
  • మరోవైపు హైడ్రా డిజాస్టర్ మేనేజ్ మెంట్ కూడా రెడీ 
  • కంప్లయింట్లు వచ్చిన వెంటనే చర్యలకు యాక్షన్ ప్లాన్
  • సిటీలో మరో రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు : సిటీలో కురుస్తున్న భారీ వర్షాలతో బల్దియా అలర్ట్ అయింది. అధికారులు గ్రౌండ్ లెవల్ లో నిత్యం పర్యవేక్షించాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే చర్యలు చేపట్టేలా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని సూచించారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరదలతో లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకునేందుకు మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ లను   ఏర్పాటు చేసింది. గ్రేటర్ వ్యాప్తంగా 534  టీమ్ లను సిద్ధంగా ఉంచింది.

ఇందులో మొబైల్ 157, స్టాటిక్ 242 , సీఆర్ఎంపీ రోడ్లపై 29, డీఆర్ఎఫ్ 30, పోలీస్ 13, విద్యుత్ 41, వాటర్ వర్క్స్ 22  టీమ్ ల చొప్పున ఏర్పాటు చేశారు.  గత నాలుగేండ్లలో చూస్తే  ఈసారి టీమ్స్​ని ఎక్కువగా పెంచారు.  వాZZటర్ స్టాగ్నేషన్ పాయింట్ల వద్ద  వరద నీటిని తొలగింపునకు కూడా చర్యలు చేపట్టింది.  సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేక దృష్టి పెట్టడంతో అధికారులు కూడా అదే తరహాలో పని చేసేందుకు రెడీ అయ్యారు.

హైడ్రా యాక్షన్​ప్లాన్​

భారీ  వానల కారణంగా హైడ్రా కూడా ప్రత్యేక యాక్షన్​ ప్లాన్​ రూపొందించింది. ఇందులో భాగంగా సర్కిల్ కు ఒక డీఆర్ఎఫ్​టీమ్​ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. వరదలు పెరిగితే అవసరమైన ప్రాంతాల్లో బోట్లను వినియోగించుకునేందు కు హైడ్రా రెడీ గా ఉంది. 8 బోట్లను అందుబాటులో ఉంచారు. ఇంకా కావాలంటే బోట్లను రప్పించేందుకు ప్రిపేర్ అయ్యారు. జోన్ల వారీగా డీఆర్ఎఫ్​కు స్పెషల్​ఆఫీసర్లను నియమించారు. ప్రతి రోజూ ఉదయం హైడ్రా కమిషనర్​రంగనాథ్​ టెలీ కాన్ఫరెన్సు ద్వారా గ్రౌండ్​లెవల్​లో పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. 

ఆఫీసుల టైమింగ్ లో మార్పులు

భారీ వానలు పడితే ఉద్యోగులు ఒకేసారి బయటకు రాకుండా ఉండాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ కోరింది. ఇందుకు పోలీసు అధికారులతో కలిసి ఓ నిర్ణయం తీసుకోనుంది. చిన్నపాటి వర్షం పడితే ఐటీ కారిడార్ లో కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో వాన పడ్డప్పుడు ఐటీ ఉద్యోగులను ఒకేసారి లాగౌట్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతర కంపెనీలు, ఆఫీసులు కూడా పాటించేలా చర్యలకు సిద్ధమైంది. ప్రజలు కూడా అత్యవరమైతేనే  బయటకు రావాలని అధికారులు సూచించారు. 

24 గంటల కంట్రోల్ రూమ్ 

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుతో పాటు హైడ్రా ఆఫీసులో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. సిటీలో ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా  040–2111111 , 040–29555500 , 9000113667 నంబర్లు కాల్ చేయొచ్చు. వాట్సప్ ద్వారా కూడా కంప్లైంట్ పంపొచ్చు. సమస్య ఫొటోతో పాటు లోకేషన్ షేర్ చేస్తే,  అక్కడకు వెంటనే డీఆర్ఎఫ్ టీమ్స్​వెళ్లేలా కంట్రోల్ రూమ్ సాయం చేయనుంది. డ్రైనేజీ మూతలు ఓపెన్ చేయొద్దని,  ఓపెన్  చేసి ఉంటే కూడా సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.