హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షానికి జీహెచ్ఎంసీ అలర్ట్

 హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతోంది. దీంతో  నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ.   వర్షం వల్ల సమస్యలు & సహాయం కోసం GHMC-DRF సహాయం కోసం 040-21111111, 9000113667లో కంట్రోల్ రూంకు డయల్ చేయాలని కోరారు.  మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు, ఈవీడీఎం బృందాలు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు.

 కాసేపటి నుంచి మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, అశోక్ నగర్, మియాపూర్, ఖైరతాబాద్, బంజారహిల్స్, లక్డికాపూల్, దిల్ సుఖ్ నగర్, అబిడ్స్, కోఠి, బషీర్ నగర్, సుల్తానా బజార్, బేగంబజార్, అఫ్జల్ గంజ్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో మేఘాలు నల్లగా మారి కుండపోత వాన కురుస్తోంది. 

Also Read :- హైదరాబాద్ లో కుండపోత వర్షం..

భారీ వర్షానికి  సాయంత్రం వేళ కావడంతో ఇంటికి వెళ్లే ఉద్యోగులు,  పలు  పనుల నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈ క్రమంలో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.