30 గజాల్లోనే ఐదారు అంతస్తుల నిర్మాణాలు

30 గజాల్లోనే ఐదారు అంతస్తుల నిర్మాణాలు
  •    50 లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో  అంతకు మించి..
  •    హాస్టళ్లకు, అద్దెలకు ఇస్తూ దందా.. 
  •    అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్ వెళ్లలేని పరిస్థితి..
  •    పట్టించుకోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు

హైదరాబాద్ సిటీ/మాదాపూర్ /జీడిమెట్ల, వెలుగు : గ్రేటర్ పరిధిలో 30, 40, 50 గజాల స్థలాల్లో ఒంటి స్తంభపు మేడలు వెలుస్తున్నాయి. 30 నుంచి 75 గజాలలోపు విస్తీర్ణంలో ఇప్పటికే నిర్మించుకున్న ఇండ్లు లక్షల్లో ఉన్నాయి. కొత్తగా కట్టుకుంటున్న వారు కూడా ఆరు, ఏడు అంతస్తులకు తగ్గడం లేదు. వీటి నుంచి ముప్పు పొంచి ఉన్నా ఫీల్డ్​లెవల్​అధికారులకు సోయి లేకుండా పోతుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్ల ఆధ్వర్యంలో టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్స్​ఉన్నాయి. వీరంతా కాలనీలు, బస్తీల్లో పర్యటించి అటువంటి నిర్మాణాలు కనిపిస్తే జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెప్పాలి. 

తర్వాత వాటిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ టీమ్స్​లోని కొందరు న్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు నోటీసులిచ్చి తర్వాత పట్టించుకోవడంలేదు. బిల్డర్ల నుంచి లంచాలు తీసుకుని వదిలేస్తున్నారు. ఉదాహరణకు కూకట్ పల్లి జోన్ అల్వాల్ సర్కిల్ లోని ఇందిరానగర్ కాలనీలో అనుమతులు లేకుండా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మిస్తున్నారని గుర్తించిన అధికారులు ఈ ఏడాది జూలై 12న షోకాజ్​నోటీస్​ఇచ్చారు. నిర్మాణదారుడు స్పందించకపోవడంతో అదేనెలలో 26న ఒకసారి, ఆగస్టు 17న మరోసారి నోటీసులు ఇచ్చారు. ఆ బిల్డింగ్ కూల్చాల్సి ఉన్నా నేటికీ ఆ పని చేయలేదు. కనీసం ఆ బిల్డింగ్ సీజ్ కూడా చేయలేదు.

ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే...

శేరిలింగంపల్లి సర్కిల్​కొండాపూర్​డివిజన్​లోని అంజయ్యనగర్, సిద్ధిక్​నగర్, గౌలిదొడ్డిలోని కేశవ్​నగర్, గచ్చిబౌలి విలేజ్​నంబర్​2, 3, గోపన్​పల్లి తండా, మియాపూర్​న్యూ కాలనీల్లో 50, 60, 100 గజాల స్థలాల్లో ఐదు నుంచి ఆరు అంతస్తులకు మించకుండా బిల్డింగులు నిర్మిస్తున్నారు. ఐటీ కారిడార్​పక్కనే ఉండడం, హాస్టళ్లకు, అద్దెలకు భారీ డిమాండ్​ఉండడంతో నిర్మాణదారులు తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు కడుతున్నారు. టౌన్​ ప్లానింగ్​అధికారులు తమకు కావాల్సింది తీసుకుని పక్కకు తప్పుకుంటుండడంతో ఏడు, ఎనిమిది అంతస్తులు కూడా కట్టేస్తున్నారు. 

ఇలాంటి చోట్ల అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్​వెళ్లడానికి కూడా దారి ఉండడం లేదు. సిద్ధిక్​నగర్, కేశవ్​నగర్​కాలనీల్లో 50, 60 నుంచి 100 గజాల్లోపు జాగా ఉండి 5 నుంచి 6 అంతస్తులకు తగ్గకుండా కట్టిన బిల్డింగులు వందల్లో ఉన్నా ఆఫీసర్లు లైట్​ తీసుకుంటున్నారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని సూరారం చౌరస్తాలో నర్సాపూర్ మెయిన్​రోడ్డుకు ఆనుకొని ఓ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్లాట్ విస్తీర్ణం 95.5 గజాలు కాగా, రోడ్డు వైడెనింగ్ లో 45.3 చదరపు గజాలు పోతుంది. 

మిగిలేది 50.2 గజాలు మాత్రమే. ఇందులో జీ+ 2 నిర్మాణాలను అనుమతులు తీసుకున్నారు. ఈ అనుమతుల ప్రకారం 30 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయాలి. కానీ 50 గజాల్లో పూర్తిగా సెల్లార్ తీశారు. మూడు అంతస్తులకు స్లాబ్​వేశారు. దీనిపై మరో రెండు అంతస్తులు కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెయిన్​రోడ్డు పక్కనే ఇదంతా జరుగుతున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదు. 

షాపులకు కిరాయిగా.. 

ప్రధాన మార్కెట్​ఏరియాలైన బేగంబజార్, ఉస్మాన్ గంజ్, మదీనా మార్కెట్ లతో పాటు పలు చోట్ల 30 చదరపు గజాల్లో ఐదారు ఫ్లోర్లతో నిర్మాణాలు జరుపుతున్నారు. బేగంబజార్ లో ఇటీవల రూ.10లక్షలకు గజం పలకడంతో 30 గజాలున్నా బిజినెస్​కోసం ఐదారు ఫ్లోర్లు వేసి రెంట్​కు ఇస్తున్నారు. ప్రధాన మార్కెట్లలో ఎక్కడ చూసిన ఇదే తరహా కనిపిస్తోంది. 

కనీసం నడిచేందుకు కూడా జాగా లేని ప్రాంతాలున్నాయి. వీటిల్లోనే గోదాములు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగిన ప్రాణ నష్టం భారీ స్థాయిలో ఉంటుంది. అయినా అధికారులు ఈ బజార్లవైపు చూడడం లేదు. ఈ నిర్మాణాల గురించి సర్కిల్స్ లో ఉండే చైన్ మైన్ లకు తెలిసిన పట్టించుకోవడంలేదు.  

సిద్ధిక్​నగర్​లో టౌన్ ప్లానింగ్ సర్వే

గచ్చిబౌలి సిద్ధిక్ నగర్ లో రెండు రోజుల కింద పక్కకు ఒరిగిన బిల్డింగ్​ను శేరిలింగంపల్లి బల్దియా  అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. 60 గజాల్లోనే 5 అంతస్తులు కట్టడంతో ఆశ్చర్యపోయిన టౌన్ ప్లానింగ్ అధికారులు సిద్ధిక్ నగర్ తో పాటు అంజయ్యనగర్​లో తక్కువ గజాల్లో కట్టిన బిల్డింగులు ఎన్ని ఉన్నాయని లెక్క తీస్తున్నారు. ఇప్పటివరకు 50 నుంచి 100, 150 గజాల్లో కట్టిన 5, 6, 7 అంతస్తుల బిల్డింగులను గుర్తించారు. ఈ బిల్డింగులలో ఓయో, హాస్టల్స్, రెంటల్ కోసం ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు. అగ్నిప్రమాదం జరిగితే అసలు బిల్డింగ్ వద్దకు ఫైర్ ఇంజన్ చేరుకునే పరిస్థితి ఉందా అని తెలుసుకుంటున్నారు. 

అనుమతులు పొందాల్సింది ఇలా

నిజానికి 30 చదరపు గజాల జాగా ఉన్నా అనుమతి తీసుకొని నిర్మాణం చేసుకోవాలి. అయితే రోడ్డు ఫెసిలిటీ ఉందా లేదా అన్నది చూసి అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. 50 చదరపు గజాల్లోపు జాగా ఉంటే జీ ప్లస్ వన్​ లేదా ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకోవచ్చు. 50 నుంచి 75 వరకు చదరపు గజాల్లోపు అయితే జీ ప్లస్ 2 లేదా 10 మీటర్ల ఎత్తు వరకు కట్టుకోవచ్చు. 50 చదరపు గజాల్లోపు ఫ్రంట్ సెట్ బ్యాక్ 1.5 మీటర్లు ఖచ్చితంగా వదలాలి.  50 దాటితే ముందు భాగంలో 1.5 మీటర్లు , చుట్టూ ఒక మీటర్ సెట్ బ్యాక్ ఉండాలి. 

75 చదరపు గజాల్లోపు స్థలం ఉంటే బల్దియాకు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. 75 చదరపు గజాలకు మించిన నిర్మాణాలకు సంబంధిత ఏరియాని బట్టి ఫీజులు చెల్లించి అనుమతులు పొందాలి. 100 నుంచి 300 చదరపు గజాల్లోపు జాగా ఉంటే జీ ప్లస్ 2,3 వరకు నిర్మించుకోవచ్చు. 100 నుంచి 200 చదరపు గజాల నిర్మాణాలకు చుట్టూ మీటర్ సెట్ బ్యాక్, ముందుభాగంలో  1.5 మీటర్లు వదలాలి. 

200 నుంచి 300 చదరపు గజాలలోపు  స్థలం ఉన్నవారు జీప్లస్ 2 కట్టుకుంటే  ముందుభాగంలో 2 మీటర్ల సెట్ బ్యాక్, చుట్టూ మీటర్ వదలాలి. మూడు ఫ్లోర్ల నిర్మాణాలకు ముందుభాగంలో 2 మీటర్లు, చుట్టూ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1.5 మీటర్లు ఉండాలి. వీటి సెల్లార్లకు అనుమతులుండవు. కానీ, 90 శాతం మంది నిబంధనలు పాటించడం లేదు.

చర్యలు తీసుకుంటం..

కొత్తగా అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని బల్దియా టౌన్ ప్లానింగ్ లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. గచ్చిబౌలిలో ఒరిగిన భవనాన్ని కూల్చేశామని, ఇకపై అంతటా ఇదే తరహాలో చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న కమిషనర్​జార్ఖండ్ నుంచి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.