ఆర్టీసీ బస్ షెల్టర్లు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్ ల మధ్య వివాదాలకు తెర తీశాయి.కొత్త, పాత వాటిపై సర్వే చేయిం చి నిర్మించేం దుకు బల్దియా యాడ్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకొని పనులు అప్పగించిం ది. కానీ నిర్మిం చిన చోట్ల హెచ్‌ఎంఆర్ కూల్చి వేస్తోంది. ఆ సంస్థ చర్యలతో యాడ్ ఏజెన్సీల్లో అయోమయం నెలకొంది.
హైదరాబాద్ , వెలుగు :గ్రేటర్ లో సిటీ బస్ షెల్టర్లు రెండు సంస్థల మధ్య గొడవ పెట్టాయి. ఆర్టీసీ ప్రయాణికులకు ఉపయోగపడే బస్ షెల్టర్ల మాట ఎత్తితే చాలు ఆ సంస్థల అధికారులు మండిపడుతున్నారు. ఎండకాలం కావడంతో సిటీలో సరిపడా బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఆ రెండు సంస్థలు మాత్రం సమన్వయం లేక కొట్టుకుంటున్నాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 2,300 వరకు బస్ షెల్టర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ గ్రౌండ్ లెవల్ లో అవి కనిపించవు. కొన్ని చోట్ల ఉన్నా సరైన వసతులు లేక ప్రయాణికులు రోడ్లపైనే నిల్చుంటున్నారు. ఇంకొన్నిఏరియాల్లోనైతే చెట్ల కింద, కిరాణం షాప్ మెట్లమీద, మెట్రో పిల్లర్ల కింద లేదంటే రోడ్డు పక్కన నిలబడుతున్నారు. మరికొన్ని చోట్ల షెల్టర్లలో చెత్త చెదారం, ఇళ్ల వ్యర్థాలతో నింపేశారు. ఇలా సిటీలో చాలా ఏరియాల్లో బస్ షెల్టర్లు లేక ఆర్టీసీ ప్రయాణికుల ఇబ్బందులు కనిపిస్తాయి.
రెండేళ్ల కిందటే దృష్టి
సిటీలో బస్ షెల్టర్ల నిర్మాణంపై రెండేళ్ల కిందటనే జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. వీటి నిర్మాణం కోసం ఆస్కి, జీహెచ్ఎంసీ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఫస్ట్ ఫేస్ కింద 826 బస్ షెల్టర్ల కోసం పాయింట్లను గుర్తించారు. వాటి నిర్మాణం కూడా పీపీపీ పద్ధతిలో చేపట్టాలని భావించాయి.జీహెచ్ఎంసీ పైసా ఖర్చులేకుండా అడ్వటైజింగ్ ఏజెన్సీలకు గతేడాది పనులను కేటాయించింది. బస్ షెల్టర్ల పై ప్రకటనల హక్కును కూడా వాటికే ఇస్తూ 15 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రతిఏటా జీహెచ్ఎంసీకి పన్ను చెల్లిస్తూ బస్ షెల్టర్ల నిర్వహణ బాధ్యత చూడాల్సి ఉంది.మూడు ప్రధాన యాడ్ ఏజెన్సీ సంస్థలైన ప్రకాశ్,యూని, కేకే ఈ పనులు దక్కించుకున్నాయి.ముందుగా బస్ షెల్టర్లను నాలుగు గ్రేడ్లుగా విభజించి పనులను కేటాయించింది. గ్రేడ్ వన్లో ఏసీ బస్ షెల్టర్లు, మిగిలిన గ్రేడ్లలో నాన్ ఏసీ,సాధారణ బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.అయితే ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు ఏజెన్సీలు 826 లో దాదాపు 500 బస్ షెల్టర్ల నిర్మాణం పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు.
తొలగిస్తోన్న హెచ్ఎంఆర్
హైద్రాబాద్ మెట్రో రైల్ సంస్థ మాత్రం సిటీలోని మెట్రో మార్గా ల్లో కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్లను తొలగిస్తోంది. మాదాపూర్ పీఎస్, హబ్సీగూడ ,తార్నాక సీసీఎంబీ , జూబ్లీహి ల్స్ పెద్దమ్మ టెంపుల్,కావూరి హిల్స్, శేరిలింగం ప ల్లి మార్గా ల్లో జేసీబీ-లతో కూల్చివేసింది. ఇవేకాకుండా ఎల్బీ న గ ర్- –మియాపూర్, నాగోల్- – హైటెక్ సిటీ, జేబీఎస్-–సీబీఎస్ మెట్రో మార్గా ల్లో కొత్తగా ఏర్పాటు చేసినదాదాపు 50కి పైగా బస్ షెల్టర్లను నేలమట్టంచేసింది. మరో 100 నిర్మిం చ కుం డా హెచ్ఎం-ఆర్ అడ్డుపడుతున్నట్లు యాడ్ ఏజెన్సీ సంస్థలు,జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
పుట్‌పాత్‌ల అభివృద్ధి
మెట్రో మార్గాల్లో ఫుట్ పాత్ లను హెచ్ఎంఆర్ సంస్థనే అభివృద్ధి చేస్తోంది. అదేవిధంగా హెచ్ఎంఆర్ ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లపై బస్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది. ప్రకటనల ఆదాయం వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.కానీ జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న బస్ షెల్టర్లను హెచ్ఎంఆర్ తొలగిస్తోంది. బల్దియా పాలక వర్గం నిర్ణయాన్నే కాదని, హెచ్ఎంఆర్ చేస్తున్న చర్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి.
ట్రాఫిక్ పోలీసులు పెట్టనిస్తలేరు
ఒక వైపు మెట్రో మార్గా ల్లో హెచ్ఎంఆర్ బస్ షెల్టర్లు తొలగిస్తుంటే, మరోవైపు ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని ట్రాఫిక్ పోలీసులు కొత్తవి పెట్టనిస్తలేరు. సుమారు100 – 150 వ ర కు బస్ షెల్టర్లను నిర్మించకుండా చేస్తున్నారు.సర్వే చేసిన తర్వాతనే నిర్మాణం చేస్తుంటే, మెట్రో ఏర్పాటు చేస్తున్న లోకేషన్లలో బస్సులు ఆగడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో తిరిగే పబ్లిక్ కు అనుకూలంగా ఉండని ప్రదేశాల్లో హెచ్‌ఎంఆర్ ఏర్పాటు చేస్తున్నది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే బస్ షెల్టర్లకు హెచ్ఎంఆర్ ఏర్పాటు చేసే వాటికి తేడా ఏందో అర్థం కావడం లేదు.– బండి రమేష్ అడ్వర్టైజింగ్ ఆఫీసర్ , జీహెచ్ఎంసీ